షర్మిల వేళ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు - ఎన్నికల వేళ కొత్త టర్న్..!!

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్రంలో కొత్త వ్యూహం అమలు చేస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తూ బీజేపీ తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. కానీ, బీజేపీ మాత్రం పొత్తుల పైన స్పష్టత ఇవ్వటం లేదు. ఎన్నికల దిశగా కార్యాచరణకు పార్టీ శ్రేణులకు ఇస్తున్న సంకేతాలు ఒంటరి పోరును సూచిస్తున్నాయి. తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని బీజేపీ చెబుతోంది. ఇదే సమయంలో తొలి సారి షర్మిల లక్ష్యంగా పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు.

పొత్తుల లెక్కలు
టీడీపీ, జనసేన తో బీజేపీ కలిసి వస్తుందని ఇప్పటి వరకు అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, బీజేపీ నుంచి స్పష్టత రావటం లేదు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీకి సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. అటు టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల ఖరారు..మేనిఫెస్టో ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో..మూడు పార్టీల పొత్తులో అస్పష్టత కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లోనే బీజేపీ నుంచి పొత్తు పైన స్పష్టమైన నిర్ణయం వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 24 పార్లమెంటు ఎన్నికల కేంద్రాలను ప్రారంభించారు.

BJP state president Purandewari reacts on YS Sharmila Comments over AP Special status

షర్మిలకు ప్రశ్నలు
ఇదే సమయంలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల పైన పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ తో సహా, చంద్రబాబు, పవన్ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఇదే అంశం పైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఢిల్లీ వేదికగా నిరసన చేపట్టేందుకు షర్మిల పార్టీ నేతలతో ఢిల్లీ వెళ్లారు. ఈ అంశం పైన స్పందించిన పురందేశ్వరి కాంగ్రెస్‌కు ఏపీలో కొత్త అధ్యక్షురాలు వచ్చారని..ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారన్నారు.

వైసీపీ పై విమర్శలు
ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అంటే, ప్రత్యేక ప్యాకేజీకి గతంలో అంగీకరించ లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఏపీకి ఏ విధంగానూ అన్యాయం చేయలేదని తేల్చిచెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే, దానిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడిపై ఉందన్నారు. అలా ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక సాధికారిక యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న వైసీపీకు.. ఆ నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్ధి కోసం కేటాయించిందని పురందేశ్వరి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+