కలిసే ముందుకు: షా టార్గెట్ 45లక్షలు(పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 45 లక్షలమందిని పార్టీలో సభ్యులుగా చేర్పించేందుకు ప్రతి కార్యకర్త నడుంబిగించేలా నేతలు సన్నద్ధం కావాలని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా అడుగుపెట్టిన అమిత్‌షా ప్రధానంగా సభ్యత్వ నమోదుపైనే కోర్ కమిటీతోనూ, తర్వాత రాష్ట్రంలోని ప్రముఖులతోనూ చర్చించి దశా నిర్దేశం చేశారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఒక కోటీ 80 లక్షల మందిని సభ్యులుగా చేర్పించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందని అమిత్ షా చెప్పారు. సభ్యత్వ నమోదుకై ప్రతి నాయకుడు కనీసం వారంపాటు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. క్రియాశీలక కార్యకర్త కనీసం మరో వంద మందిని సభ్యులుగా చేర్పించాల్సి ఉంటుందన్నారు. కులమత వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరినీ సభ్యునిగా చేర్పించాలన్నారు.
తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించినందున, ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయాల్సిందేనని ఇందులో వేరే ఆలోచన ఉండరాదని ఆయన చెప్పారు. అనవసర ప్రకటనలతో సరికొత్త వివాదాలు సృష్టించవద్దని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ రావటం ఒక ఎత్తయితే, తర్వాత జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలగడం మరో ఎత్తని అన్నారు.

అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 45 లక్షలమందిని పార్టీలో సభ్యులుగా చేర్పించేందుకు ప్రతి కార్యకర్త నడుంబిగించేలా నేతలు సన్నద్ధం కావాలని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారు.

అమిత్ షా
రాష్ట్రంలో తొలిసారిగా అడుగుపెట్టిన అమిత్‌షా ప్రధానంగా సభ్యత్వ నమోదుపైనే కోర్ కమిటీతోనూ, తర్వాత రాష్ట్రంలోని ప్రముఖులతోనూ చర్చించి దశా నిర్దేశం చేశారు.

అమిత్ షా
దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఒక కోటీ 80 లక్షల మందిని సభ్యులుగా చేర్పించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందని అమిత్ షా చెప్పారు.

అమిత్ షా
సభ్యత్వ నమోదుకై ప్రతి నాయకుడు కనీసం వారంపాటు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు.

అమిత్ షా
క్రియాశీలక కార్యకర్త కనీసం మరో వంద మందిని సభ్యులుగా చేర్పించాల్సి ఉంటుందన్నారు. కులమత వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరినీ సభ్యునిగా చేర్పించాలన్నారు.

వెంకయ్యనాయుడు
తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించినందున, ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయాల్సిందేనని ఇందులో వేరే ఆలోచన ఉండరాదని ఆయన చెప్పారు.

అమిత్ షా
అనవసర ప్రకటనలతో సరికొత్త వివాదాలు సృష్టించవద్దని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ రావటం ఒక ఎత్తయితే, తర్వాత జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలలో ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిరోహించగలగడం మరో ఎత్తని అన్నారు.

అమిత్ షా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనకు అనుకూల వాతావరణం నెలకొని ఉన్నందున ఇక ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలని పదేపదే చెప్పారు.

అమిత్ షా
కోర్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై రసవత్తర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జాప్యం జరిగేకొద్దీ విమర్శలకు గురికావాల్సి వస్తున్నదంటూ కొందరు నేతలు ప్రస్తావించినట్లు తెలియవచ్చింది.

అమిత్ షా
అమిత్ షా నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, శాసనసభ్యులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications