కేసీఆర్‌కు 'సాగర్', 'మెట్రో' చిక్కు: తెలుగు నేర్చుకుంటున్న అక్బర్ నవ్వించారు

హైదరాబాద్: రాజధాని నగరం అభివృద్ధి పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది. అయితే, ఈ సమావేశంలో ప్రభుత్వంతో పలు అంశాల పైన విపక్షాలు విభేదించాయి. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు సమావేశం జరిగింది.

మెట్రో రైలు, సాగర్...

అఖిల పక్ష సమావేశంలో మెట్రో రైలు అలైన్మెంటు పైన ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు మార్గాల్లో మార్పుకు మాత్రం అఖిలపక్షం అంగీకరించింది. పాతబస్తీలో మార్పులకు అంగీకారం కుదరలేదు. అలాగే హుస్సేన సాగర్‌లో వినాయక నిమజ్జనం వద్దనే విషయంలోను ఏకాభిప్రాయం కుదరలేదు.

సాగర్‌లో నిమజ్జనం చేయాల్సిందే: కిషన్ రెడ్డి

BJP and TDP oppose Vinayaka Sagar

వినాయక నిమజ్జనం సాగర్‌లో చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. గణేష్ నిమజ్జనాలకు కృత్రిమ చెరువు సరికాదన్నారు. అలాగే పాతబస్తీలో మెట్రో రైలు మార్గం పాత ప్లాన్ ప్రకారమే ఉండాలన్నారు.

పాతబస్తీలో మెట్రో మార్పుకు అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. పేదల ఆదీనంలో 120, 100 గజాల ఇళ్లు ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. భూకబ్జాల పైన ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకు వస్తే సహకరిస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.

మెట్రోను నిర్లక్ష్యం చేయవద్దు: ఎర్రబెల్లి, రమణ

మెట్రో రైలును నిర్లక్ష్యం చేయవద్దని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రంగా ఉంచాల్సిందేనని, దానికి తాము అంగీకరిస్తామని, అయితే, వినాయక నిమజ్జనం వద్దంటే ఊరుకోమన్నారు. నిమజ్జనం చేసినా వాటిని తీసి వేయవచ్చునని చెప్పారు.

మెట్రో రైలు నిర్మాణం అసెంబ్లీ ముందు నుండి మార్చితే అభ్యంతరం లేదని చెప్పారు. 120 గజాలు కబ్జా ఇళ్లను ప్రభుత్వం వదిలేయాలన్నారు. హైదరాబాదులోని ఆస్తులను సీఎం కేసీఆర్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని, దానిని తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.

సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి: భట్టి

వినాయక సాగర్ నిర్మాణం సాధ్యాసాధ్యాలను ముందుగా పరిశీలించాలని భట్టి విక్రమార్క అన్నారు. సాగర్ చుట్టూ ఉన్నట్లు ఇందిరా పార్క్ వద్ద వెడల్పైన రోడ్లు లేవని చెప్పారు. మెట్రో రైలు అలైన్మెంటులో మార్పులు లేకుంటే నష్టమేమిటో ప్రభుత్వం చెప్పాలని, ఆ తర్వాతే తమ అభిప్రాయం చెబుతామన్నారు.

క్రమబద్ధీకరణ సరికాదు: తమ్మినేని

పెద్దలు ఆక్రమించుకునే ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించడం సరికాదని సీపీఎం నేత తమ్మినేని సీతారాం అన్నారు. కబ్జా ప్రాంతాల్లో నిర్మాణాలు ఉంటే మినహాయింపులు ఇవ్వాలన్నారు. పెద్దలు ఆక్రమిస్తే మాత్రం కచ్చితంగా ఖాళీ చేయించాల్సిందేనని చెప్పారు.

నిమజ్జనం మరోచోట: అక్బరుద్దీన్

వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో కాకుండా మరోచోట చేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సాగర్‌ను శుభ్రం చేయాలన్నారు. సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించవచ్చునని చెప్పారు.

నవ్వులు పూయించిన అక్బరుద్దీన్

మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ సచివాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం నవ్వులుపూయించారు. విలేకరులతో ఆయా పార్టీల నేతలు మాట్లాడుతున్న సమయంలో.. అక్బరుద్దీన్ వంతు వచ్చింది. మైకు వద్దకు వచ్చిన ఆయన ఇంగ్లీషులో మాట్లాడాలా లేక ఉర్దూలో మాట్లాడాలా అన్నారు.

ఓ విలేకరు మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడండి అన్నారు. దీనికి అక్బర్ స్పందిస్తూ.. వచ్చే సంవత్సరం తెలుగులో మాట్లాడతా అన్నారు. దీంతో అక్కడ నవ్వులు విరబూసాయి. తాను తెలుగు నేర్చుకుంటున్నానని, అందుకే వచ్చే సంవత్సరం మాట్లాడతానని చెప్పానని అక్బరుద్దీన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+