2024లో ఏపీలో బీజేపీదే అధికారం .. బాధ్యతలు చేపట్టిన రోజే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు . విజయవాడలో ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి బిజెపి నేతలు రామ్ మాధవ్ ,సతీష్ జీ , పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ విష్ణు ,ఎమ్మెల్సీ మాధవ్, రావెల కిషోర్ బాబు తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు రాష్ట్రంలో బిజెపి జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి బిజెపి అవసరం ఉందని పేర్కొన్న ఆయన మంచి పరిపాలన అందించడం బీజేపీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే అది బిజెపితోనే సాధ్యమని పేర్కొన్న సోము వీర్రాజు, 2024 లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

BJP will be in power in AP in 2024.. AP BJP chief Somu Veerrajus comments

ఏపీలో బీజేపీ కీలక భూమిక పోషించే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి కుటుంబ పార్టీలేనని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.
ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఏపీ రాజకీయాల్లో బీజేపీ వాణిని వినిపించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. బిజెపి నాయకులు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం పోరాటం సాగించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని సోము వీర్రాజు ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+