టీడీపీతో పొత్తుపై బీజేపీ తేల్చేసింది - కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందం : రాబోయే ఎన్నికల్లో ఇదే జరిగేది...!!
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీ మరోసారి బీజేపీకి దగ్గయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రకమైన సంకేతాలు స్పష్టంగా కనిపించాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. బద్వేలు ఉప ఎన్నికలోనూ టీడీపీ ఓట్లు కొంత మేర బీజేపీకి బదిలీ అయ్యాయి. దీంతో.. తిరిగి 2014 తరహాలో బీజేపీ.. టీడీపీ..జనసేన పొత్తు పెట్టుకుంటాయనే చర్చ రాజకీయంగా మొదలైంది. బద్వేలు ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీతో పొత్తు పైన కీలక వ్యాఖ్యలు..
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. తెలంగాణలో టీడీపీకి తాళం పడింది.. త్వరలోనే ఆంధ్రాలోనూ తాళం పడబోతోందని అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీడీపీతో .. బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ.. ఒక కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ .. దానికి ఒక దిశ, దశ లేదని విమర్శించారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి ఓటువేయ్యాలని తమ కార్యకర్తలకు చెప్పారని తెలిపారు.

కాంగ్రెస్.. టీడీపీల మధ్య లోపాయకారి ఒప్పందం
కాంగ్రెస్.. టీడీపీల మధ్య లోపాయకారి ఒప్పందం కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు, కో ఇన్‌చార్జ్‌లే.. హైకమాండ్‌కు ప్రతినిధులన్నారు. మా జాతీయ నాయకత్వానికి మేమే కళ్లు, చెవులని పేర్కొన్నారు. హైకమాండ్ అభిప్రాయమే.. నేను చెబుతున్నానని ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బద్వేలు ఉప ఎన్నిక పైన స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని బెదిరించి ఓట్లు వేయించుకుని బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించిందని ఆరోపించారు.

సీఎం జగన్ పైనా విమర్శలు
బద్వేలులో వైసీపీ గెలుపు జగన్‌కు మచ్చన్నారు. ఉప ఎన్నికతో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని, దీంతో పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగిదన్నారు.రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు భయానక వాతావరణంలో జరగనున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్, బూత్‌ల స్వాధీనం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. 600 బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారన్నారని దుయ్యబట్టారు. ప్రజలు వ్యతిరేకించినా బలవంతంగా ఓట్లు వేయించుకున్నారని, రాబోయే ఎన్నికల్లోను ఇదే జరుగుతుందని హచ్చరించారు.












Click it and Unblock the Notifications