ద్రోహీ హైదరాబాద్ నుండి వెళ్లిపో!: జగన్‌కు పరాభవం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ విమానశ్రయంలో సెగ తగిలింది. పలువురు బిజెపి కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఢిల్లీ నుంచి వస్తున్న తమ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి వేలాది సంఖ్యలో బిజెపి కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. అదే సమయంలో విమానాశ్రయంలో నుండి బయటకు వస్తున్న వైయస్ జగన్‌ను వారు చూశారు.
దీంతో జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ కాన్వాయ్‌ను అడ్డుకు్నారు. కాన్వాయ్ కదలకుండా ఎదురుగా వెళ్లి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో విమానాశ్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు వారిని పక్కకు లాగి జగన్ కాన్వాయ్‌కి ముందుకు పోనిచ్చారు.












Click it and Unblock the Notifications