విజయవాడలో వైఎస్ షర్మిలపై బీజేవైఎం దాడి..! తీవ్ర ఉద్రిక్తత..!

ప్రధాని మోడీ అమరావతికి రాకవేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఇవాళ విజయవాడలో బీజేవైఎం కార్యకర్తలు దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ దగ్గర నిరసనకు దిగిన షర్మిలపై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించారు.

కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కోసం వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకూ, కాంగ్రెస్ కార్యకర్తలకూ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఇరుపక్షాల మద్య బాహా బాహీ కొనసాగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా బిజేవైఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బిజేవైఎం నేతల ను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. బీజేవైఎం కార్యకర్తల తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjym attacks apcc chief ys Sharmila with eggs and tomatoes in protest against remarks on pm modi

బిజెపి నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఏపీలో వైసిపి ఉన్నా, కూటమి ఉన్నా అధికార పెత్తనం మాత్రం బిజెపిదే అన్నారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రాన్ని మోడీ నాశనం చేశారన్నారు. టిడిపి, జనసేన, వైసిపి నాయకులూ ఎలాగూ పశ్నించరని, మోడీ మోసాలను నిలదీస్తే తనను టార్గెట్ ఛేసి దాడి చేయిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేస్తారా అని అడిగారు.

ఏపీసీసీ అధ్యక్షురాలి పైనే ఇలా దాడికి తెగబడితే.. మా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపలకు వచ్చారంటే పోలీసులు సహకారం లేకుండా వస్తారా అని అడిగారు. ఎవరైతే ఇప్పుడు దాడిలో ఉన్నారో అందరి పైనా హత్యా యత్నం కేసులు నమోదు చేయాలన్నారు. మీ అన్యాయాలను ప్రశ్నిస్తే సహించలేరా.. మోసాలు బయట పెడితే దాడి చేస్తారా అని షర్మిల నిలదీశారు. ఈ ఘటనల‌పై కూటమి ప్రభుత్వం తనకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఇదేనా మీ పాలనలో మహిళలకు జరిగే న్యాయం అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు వారి పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అంతకు ముందు ఉదయం గతంలో ప్రధాని మోడీ అమరావతికి శంఖుస్ధాపన చేసిన స్ధలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరంలోని ఆమె ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు. దీనిపై షర్మిల తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా షర్మిల హౌస్ అరెస్టును ఖండిస్తూ ట్వీట్లుచేశాారు. అనంతరం వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+