టీడీపీ హైకమాండ్ కు బొజ్జల షాక్ - ఆగిపోయిన వైసీపీ నేత చేరిక..!!
టీడీపీ అధినాయకత్వానికి యువ నేత షాక్ ఇచ్చారు. చంద్రబాబు సొంత జిల్లాలో వేగంగా మారిన పరిణామాలతో వైసీపీ నేత చేరిక వాయిదా పడింది. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత వైసీపీ నాయకుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబును చేరి ఈ రోజు పార్టీలో చేరేలా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చివరి నిమిషంలో నియోజకవర్గంలో సీన్ మారిపోయింది. నాయుడు చేరికను శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఆడియో వైరల్ అవుతోంది.
శ్రీకాళహస్తి టీడీపీలో కలకలం : శ్రీకాళహస్తి టీడీపీలో కలకలం మొదలైంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో కొనసాగుతున్న ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. నాయుడు కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ఆయనతో పొసగడం లేదు.

నాయుడు టీడీపీలో చేరటంతో కాళహస్తితో పాటుగా సత్యవేడులో ప్రభావం చూపుతారని పార్టీ నేతలు అంచనా వేసారు. నాయుడు చేరిక సమయంలో శ్రీకాళహస్తి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజకవర్గ టీడీపీ నేతలకు ఒక ఆడియో సందేశం విడుదల చేసారు. దీంతో పార్టీ వెనుకడుగు వేసింది. నాయుడు చేరికను తాత్కాలికంగా వాయిదా వేసింది.
బొజ్జల ఆడియో వైరల్ : బొజ్జల సుధీర్‌రెడ్డి విడుదల చేసిన ఆడియోలో అమరావతిలో ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరుతున్నారని సమాచారం వచ్చిందని. ఒక ఇన్‌చార్జిగా నాకు కూడా ఆయన చేరిక విషయం అధికారికంగా తెలియదని చెప్పుకొచ్చారు. ఎవరూ తనతో మాట్లాడలేదని పేర్కొన్నారు. బూత్‌స్థాయి మొదలుకుని టీడీపీ మండలాధ్యక్షులు, ఇతర నాయకులెవరూ రేపు అమరావతికి వెళ్లొద్దని ఆదేశించారు.
వైసీపీ నుంచి అతను చేరుతున్నారు కాబట్టి, ఆ పార్టీ నుంచి వెళ్తారని చెప్పుకొచ్చారు. నేను చెప్పేది అర్థం చేసుకోవాలని. ఏది సరైందని అనుకుంటే అలా నడుచుకోవాలని కోరుకుంటున్నాని బొజ్జల సుధీర్ తన సందేశంలో పేర్కొన్నారు. దీంతో, ఈ నెలన చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఆ రోజున బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవి నాయుడు కుప్పంకు రావాలని అధిష్టానం నుంచి సమాచారం పంపారు.

కుప్పంకు ఆహ్వానం : బొజ్జల సుధీర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి సీటు ఖాయంగా కనిపిస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. కాళహస్తిలో సీటు సుధీర్ రెడ్డికే అంటూ లోకేశ్ సంకేతాలు ఇచ్చారు. ఈ సమయంలో నాయుడు చేరిక ద్వారా పోటీ మొదలయ్యే అవకాశం ఉందని సుధీర్ రెడ్డి సందేహిస్తున్నట్లు కనిపిస్తోంది.
నాయుడు చేరిక పైన తనకు సమాచారం లేదని సుధీర్ రెడ్డి చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మినహా మరే సీటు టీడీపీ గెలుచుకోలేదు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల నడుమ టీడీపీ అధినాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది చూడాలి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications