జగన్ వల్ల ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్: బోండా ఉమ ఆగ్రహం
ముఖ్యమంత్రి సీటు కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని, ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం అలాంటిదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మండి
అమరావతి: ముఖ్యమంత్రి సీటు కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని, ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం అలాంటిదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.
Recommended Video


జగన్ పాదయాత్ర అందుకోసం కాదు
బుధవారం బొండా విలేకరులతో మాట్లాడారు. జగన్ పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసమే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని, అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చామన్నారు.

చంద్రబాబు ఏపీని నెంబర్ వన్ చేస్తుంటే, జగన్ అవినీతిలో
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతుంటే జగన్ మాత్రం అవినీతిలో నెంబర్ వన్ చేస్తున్నాడని ఆయన బొండా దుయ్యబట్టారు. అలాగే జగన్ పాదయాత్ర కాదు పొర్లు దండయాత్ర చేసిన ప్రజలు నమ్మరన్నారు.

మూడో రోజు 16 కిలోమీటర్లు
ఇదిలా ఉండగా, వైసిపి అధినేత వైయస్ జగన్ పాదయాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన యాత్ర 16 కిలోమీటర్లు కొనసాగనుంది.

ఈ గ్రామాల మీదుగా
నీలితిమ్మాయిపల్లి నుంచి వీఎన్‌పల్లి, సంగాలపల్లి, గంగిరెడ్డిపల్లి, అయ్యవారిపల్లి మీదుగా ఆయన పర్యటన ఉరుటూరు వరకు సాగనుంది. జగన్ వెంట పలువురు వైసీపీనేతలు కార్యకర్తలు నడవనున్నారు.












Click it and Unblock the Notifications