కూల్చేస్తానన్నావ్, ఇప్పుడు డెమోక్రసీయా: జగన్‌పై ఉమ, రౌడీషీటర్లు: 'తుని'పై రాజప్ప
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం నాడు భగ్గుమన్నారు. విజయవాడలో వైసిపి ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సేవ్ డెమోక్రసీ నిరసనల పైన ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పునాదుల పైన పెట్టిన పార్టీ వైసిపి అన్నారు. కోట్లు, ఓట్లు, కొనడాలు ఒక్క వైయస్ జగన్‌కే తెలుసునని ధ్వజమెత్తారు.
నైతిక విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. రాజకీయ నాయకులంతా ఓ వైపు ఉంటే, జగన్ ఓ వైపు ఉన్నారన్నారు. రాజ్ భవన్ సాక్షిగా, మీడియా సాక్షిగా జగన్ కొద్ది రోజుల క్రితం ఓ మాట చెప్పారని.. కొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పిన జగన్‌కు ఆనాడు అవి మాట్లాడేందుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అభివృద్ధిని చూసి టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పడం విడ్డూరమన్నారు.
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. మరికొంత మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పారు. సేవ్ డెమోక్రసీ హాస్యాస్పదం అన్నారు. ఎమ్మెల్యేలతో ఎలా నడుచుకోవాలో తెలియని జగన్ నిరసనలు తెలియజేయడం విడ్డూరమన్నారు.
జగన్ 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పడం హాస్యాస్పదమే అన్నారు. వైసిపిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారని చెప్పారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. తుని ఘటనపై మాట్లాడుతూ.. అందులో రౌడీషీటర్ల పాత్ర ఉందని చెప్పారు. త్వరలో నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications