బీసీజీ సైతం అటే మొగ్గు..: నేడు సీఎంకు నివేదిక: వెంటాడుతున్న ఆరోపణలు..!

మూడు రాజధానుల ప్రతిపాదనలను ఆచరణలో తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక వైపు అమరావతిలో నిరసనలు..మరో వైపు రాజకీయంగా విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ముందుకే వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అ అంశం మీద ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇప్పటికే మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక ఇవ్వగా..ఈ రోజు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ తమ నివేదిక ను ముఖ్యమంత్రి జగన్ కు అందచేయనుంది. ఈ కమటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ప్రభుత్వ ఆలోచనలకు దగ్గరగా ఈ సిఫార్సులు ఉన్నాయి. అయితే, మరింత తుది నివేదికలో మరింత స్పష్టంగా సూచన లు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో..బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ పైన రాజకీయ పార్టీలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సంస్థ అధ్యయనం మీద ఇప్పటికే రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ సంస్థ అక్రమాలకు పాల్పడిదంటూ కేసులు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫార్సు..

బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫార్సు..

ఏపీలో రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన రెండో కమిటీ నివేదిక సిద్దమైంది. బీసీజీ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ తన తుది నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌కు అందజేయనుంది. గత ప్రభుత్వం అనుకున్నట్లుగా ప్రపంచస్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించడం ఏమేరకు సాధ్యమో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని అమెరికాకు చెందిన ఈ కన్సల్టెన్సీ సంస్థను రాష్ట్రప్రభుత్వం కోరడం, ఇప్పటికే అది మధ్యంతర నివేదికను సమర్పించింది. అందులో గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఉత్తమమని సూచించింది. దీని ద్వారా తుది నివేదిక సైతం అమరావతి నుండి రాజధాని తరలింపు పైనే సిఫార్సులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిందా..

క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిందా..

జీఎన్ రావు కమిటీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి..దాదాపు రెండు వేల మంది రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేసామని చెప్పింది. అయితే, రైతులు మాత్రం తమ వద్దకు కమిటీ రాలేదని.. ఏ గ్రామంలోనూ అభిప్రాయ సేకరణ చేయలేదని తేల్చి చెబుతున్నారు. దీంతో..జీఎన్ రావు కమిటీకి చట్ట బద్దతను ప్రశ్నిస్తూ..ఆ కమిటీతో పాటుగా బోస్టన్ గ్రూపు నియామక జీవోలను రద్దు చేయాలని కోరుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కోర్టు దీని మీద నోటీసులు జారీ చేసింది. ఈ బోస్టన గ్రూపు రాజధాని మీద అధ్యయనం చేసిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ కమటీ క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిందా..ఎవరి అభిప్రాయాలు సేకరించిందీ అనేది స్పష్టత రావాల్సి ఉంది. లేక, ఏపీలోని భౌగోళిక..ఆర్దిక పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు చేసిందా అనేది తేలాల్సి ఉంది.

బీసీజీని వెంటాడుతున్న ఆరోపణలు..

బీసీజీని వెంటాడుతున్న ఆరోపణలు..

ప్రభుత్వం రాజధాని అంశం పైన నియమించిన బీసీజీ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిందంటూ ఈ సంస్థపై పోర్చుగల్‌లో కేసు నమోదైందని, దీని విశ్వసనీయతపై సందేహాలున్నాయని అంటున్నాయి. దీనిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోందని మాజీ సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి మిత్రుడు బీసీజీలో కీలక పదవిలో ఉన్నారని, అందువల్లే ఆ సంస్థను ఎంపిక చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఎన్నెన్నో ప్రాజెక్టులపై పరిశీలన జరిపి, వాటి సాధ్యాసాధ్యాలపై నివేదికలు రూపొందించిన అనుభవమున్నందు వల్లనే బీసీజీకి అమరావతిపై అధ్యయన బాధ్యతలను అప్పగించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా రు. దీనిని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+