మానసిక ఆందోళన వల్లే, బొత్స బాగున్నారు: చిరు

బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కేర్ ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. బొత్స తీవ్రమైన రక్తంపోటు, తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాయి. గుండె నరాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో బొత్సకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. బొత్స ఆరోగ్యంపై కేర్ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.
డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెసు నాయకులు ఆయనను పరామర్శించారు. అస్వస్థత కారణంగా ఆయన మంగళవారం సాయంత్రం ఏర్పాటైన మంత్రి వర్గసమావేశానికి హాజరు కాలేకపోయారు. బొత్స ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెసు నాయకులు చెప్పారు.
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేర్ ఆస్పత్రికి వచ్చి బొత్స సత్యనారాయణను పరామర్శించారు. బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలియగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కె. కేశవరావు, శాసనసభ్యుడు నాగేశ్వర రావు, మంత్రులు దానం నాగేందర్, కన్నా లక్ష్మినారాయణ తదితరులు కేర్ ఆస్పత్రికి వచ్చారు.












Click it and Unblock the Notifications