బాబూ! రాజీనామా చెయ్, ఓటుకు నోటులో 48సార్లు నీ పేరు, కేసీఆర్‌తో లాలూచీ'
కేసీఆర్ ప్రభుత్వంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లాలూచీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గురువారం నాడు మండిపడ్డారు.
అమరావతి: కేసీఆర్ ప్రభుత్వంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లాలూచీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గురువారం నాడు మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో మొదటి ఛార్జీషీటులో 26సార్లు, రెండో ఛార్జీషీటులో 22సార్లు చంద్రబాబు పేరు ఉందని బాంబు పేల్చారు. దీనిపై ప్రజలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మీరు నిప్పా లేక తుప్పా అన్నారు.

కృష్ణా జలాల్లో రాజీ
కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు ఎలా రాజీపడ్డారో ప్రజలు ఆలోచించాలని బొత్స అన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చిన విషయం గుర్తించాలన్నారు. ఛార్జీషీటులో పేరున్న వ్యక్తి సీఎంగా కొనసాగిన దాఖలాలు లేవన్నారు.

గొంతు తనది కాదని చెప్పలేదు
చంద్రబాబుకు నైతిక విలువలు, రాజ్యాంగం పైన గౌరవం ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ఆడియో టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.

విజయవాడ పారిపోయారు
ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే చంద్రబాబు తప్పుకోవాల్సిందేనని బొత్స అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓటుకు నోటు తెరపైకి రాగానే చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ పారిపోయారన్నారు.

లాలూచీపడ్డారు
తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీపడి ఏపీ ప్రయోజనాలను గాలిసి వదిలేశారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ఆయన హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని పరిపాలన చేస్తారన్నారు.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications