మరో ఉద్యమానికి జగన్ సిద్దం, నేరుగా రంగంలోకి..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన ఇక ప్రత్యక్ష పోరు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ప్రస్తుతం మెడికల్ కాలేజీల పైన పార్టీ చేస్తున్న పోరాటంతో పాటుగా రైతుల సమస్య పైన ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఇక.. జనవరి నుంచి జగన్ జిల్లాల యాత్రకు సమాయత్తం అవుతున్నారు.
మాజీ సీఎం జగన్ పులివెందులలో మూడో రోజు పర్యటిస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురు స్థానికులు.. పార్టీ నేతలతో వారి సమస్యల పైన ఆరా తీసారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యంగా చేస్తే మరో పోరాటం తప్పదని జగన్ తేల్చి చెప్పారు. అదే విధంగా పార్టీ నేతలతోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. మెడికల్ కాలేజీల పైన పోరు తీవ్ర తరం చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే సేకరించిన సంతకాలను గవర్నర్ కు సమర్పించేలా నిర్ణయించారు. ఇక.. మెడికల్ కాలేజీల పైన మలి విడత నిరసనల్లో భాగంగా జగన్ నంద్యాల లేదా రాజమండ్రి వేదికగా దీక్ష చేపట్టాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి సానుకూలత ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి బొత్సా సైతం మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ కార్యా చరణ పైనా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్యం ప్రభుత్వ చేతుల్లో ఉండాలే తప్ప ప్రైవేట్ చేతుల్లో పెట్టడం పేదలకు న్యాయం జరుగదని అన్నారు. పీపీపీ విధానంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సంతకాల రూపేణా సేకరించి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు.
జగన్ హయాంలో కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం పేదవాళ్లు వైద్య విద్య చదువాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలో మెడికల్ కళాశాలలను మంజూరు చేశారని గుర్తు చేశారు. వీటిలో 5 కళాశాలలు పూర్తికాగా మరో 12 కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రారంభించారని తెలిపారు. జగన్ ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుర్భుద్దితో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications