బొత్స ధైర్యవచనాలు: పార్టీ జెండాలని రఘువీరా పంతం!

Botsa meets party cadre in Vishaka
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ధైర్యం చెబుతున్నారు. విభజన నిర్ణయం నేపథ్యంలో ముందే మేల్కొని ఉంటే సీమాంధ్ర ప్రాంతానికి మరింత ఎక్కువ ప్రయోజనం కలిగి కలిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆయన విశాఖలో పార్టీ నేతలతో మాట్లాడారు.

సీమాంధ్ర ప్రాంతానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పూర్తిగా సంతృప్తి నివ్వలేదన్నారు. ముందుగానే కేంద్రాన్ని అడిగి ఉంటే మరింత ప్యాకేజీ వచ్చేదన్నారు. అయితే, గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఈ మాత్రం కూడా ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పారు. పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన వారితో వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.

ఇక పార్టీ జెండాలు పెడతాం: రఘువీరా

తాము పదేళ్లుగా జాతీయ జెండాలను తమ కార్లకు పెట్టుకొని తిరిగామని, ఇక నుండి కాంగ్రెసు పార్టీ జెండాలు పెట్టుకొని మా ప్రాంతాల్లో తిరుగుతామని రఘువీరా రెడ్డి చెప్పారు.

అప్పుల ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చారు: యనమల

కాంగ్రెస్, బిజెపిలు కలిసి సీమాంధ్రులకు అప్పుల ఆంధ్రప్రదేశ్ ఇచ్చారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోట్ల అప్పులు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌ను బుందేల్‌ఖండ్ స్థాయికి దిగజార్చారన్నారు. సీమాంధ్రకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్యాకేజీలో కొత్తదనమేమీ లేదన్నారు. మరోవైపు విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని దేవినేని అన్నారు.

సోనియాకు రుణపడి ఉంటాం: విహెచ్

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటామని వి హనుమంత రావు ఢిల్లీలో అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ జిల్లాల్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియాను ఆహ్వానిస్తామని విహెచ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+