మా పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు: చంద్రబాబుపై బొత్స మండిపాటు
మచిలీపట్నం/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార బలంతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు..కృష్ణాజిల్లా మచిలీపట్టణంలో రిమాండ్‌పై జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిని సత్తిబాబు బుధవారం కలుసుకున్నారు.
ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నతమ నేతలను టార్గెట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. బడా పారిశ్రామికవేత్తల కోసం భూసేకరణ చేసిన ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు బొత్స తెలిపారు.

గుర్తింపు ఉన్న ఏజెన్సీల ద్వారానే...
విదేశాంగశాఖలో గుర్తింపు ఉన్న ఏజెన్సీల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాలకు వెళ్లే వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని పల్లె రఘునాథ్‌రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications