మూల్యం చెల్లించాం, వారే విజేత: బొత్స, కెసిఆర్‌పై దానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన పాపాన్ని అన్ని పార్టీలు కాంగ్రెసు పైకి నెట్టాయని, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. కాంగ్రెస్ పాలనలో పరిపాలనపరంగా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించారు.
అధికారంలోకి తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రానున్నాయన్నారు. అధికారం చేపట్టనున్న రెండు పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇచ్చిన హామీలను ఆయన చదివి వినిపించారు.

కాంగ్రెసు పార్టీ అధికారం కోసం ఎప్పుడు పాకులాడలేదన్నారు. గత పదేళ్లలో కాంగ్రెసు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని చెప్పారు. తమ పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు.
కెసిఆర్ పంచాంగం: దానం
రేపటి ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పంచాంగం చెప్పుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ వేరుగా అన్నారు. తెలంగాణలో తమ పార్టీదే అధికారమన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత చూపుతామన్నారు. కిషన్ బాగ్ అల్లర్లను ఖండిస్తున్నామని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కొందరు అధికారుల్లో అత్యుత్సాహం కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications