వైసీపీకి బొత్స రాజీనామా? ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి బొత్స సత్యానారాయణ రాజీనామా చేశారంటూ ఆయన రాజీనామా లేఖ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆ లేఖలో ఉంది. బొత్స సత్యనారాయణ పేరుతో ఈ లేఖ బయటకు రావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసలు వాస్తవమేనా? నిజంగానే బొత్స పార్టీని వీడుతున్నారా? అంటూ ఆరా తీస్తున్నారు. బొత్స అంటే గిట్టనివారు ఇటువంటి తప్పుడు వార్తను సృష్టించివుంటారని కొందరు భావిస్తున్నారు. ఆయన వైసీపీని వీడారా? లేదా? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

బొత్స కుటుంబానికి 4 సీట్లు
విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ప్రాధాన్యత కల్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు కేటాయించడం విశేషం. చీపురుపల్లి నుంచి బొత్స పోటీచేయగా, విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ, నెల్లిమర్ల నుంచి బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల నరసయ్య పోటీచేశారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. వచ్చేనెల తొమ్మిదోతేదీన విశాఖపట్నంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వ్యాఖ్యానించారు.

botsa satyanarayana fake resignation letter viral in social media

పీకే చెప్పింది ఏమిటి?
బొత్స ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజులు కూడా కాకముందే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ లేఖలో తేదీని ప్రస్తావించలేదు. దీంతో ఇది నకిలీదని అర్థమవడంతోపాటు ఈ లేఖను ఎవరు సృష్టించారనేది కీలకంగా మారింది. నాలుగు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళతారు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ లేఖ వైరల్ కావడంతో చాలామంది నిజమే అనుకుంటున్నారు. అయితే బొత్స స్పందించి అది నకిలీదని స్పష్టత ఇస్తే బాగుంటుందని వైసీపీ కార్యకర్తలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+