Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు, పవన్ కు బొత్సా థ్యాంక్స్ - ఏం జరుగుతోంది..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. ఇదే సమయంలో పాలనా పరంగా .. రాజకీయంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. అటు వైసీపీ ప్రభుత్వం పై పోరుబాటకు సిద్దమైంది. ఎన్నికల హామల అమలు కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతోంది. ఇదే సమయంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ కు థ్యాంక్స్ చెప్పిన బొత్సా కీలక సూచనలు చేసారు.

ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన మెగా పేరెంట్స్ - టీచర్ల మీటింగ్ పైన బొత్సా స్పందిం చారు. ఈ కార్యక్రమం ద్వారా నాటి తమ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించార‌ని .. మరోసారి తమ పాలన గుర్తు చేసారంటూ చంద్రబాబు, పవన్ కు ధన్యవాదాలు చెప్పారు. అదే సమయంలో నాడు-నేడు ద్వారా స్కూల్స్‌లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బాగుండేద‌ని సూచించారు. కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలుపై పరుచూరి బ్రదర్స్‌లా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సరికాదన్న బొత్సా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేసారు.

Botsa Says thanks to Chandra babu and Pawan Kalyan made key suggestion

తమ ప్రభుత్వ హయాంలో విశాఖకు వచ్చిన కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని బొత్సా పేర్కొన్నారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదని తేల్చారని వివరించారు. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖల రాస్తానని వెల్లడించారు. రైతాంగాన్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని బొత్సా ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఈనెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు.పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని బొత్సా డిమాండ్ చేసారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్‌ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు.

ఫీజ్ రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలనే డిమాండ్ తో తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 3న కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. సీబీఐ కంటైనర్‌లో డ్రగ్స్ లేదని సీబీఐ చెప్పడంతో.. విశాఖపై ఉన్న డ్రగ్స్ మచ్చ పోయిందన్నారు. విశాఖ డైరీపై వేసిన సభా సంఘంపై ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని లేఖ రాసినట్లు బొత్సా పేర్కొన్నారు. సభా సంఘంలో శాసనమండలి లోని సభ్యులను భాగస్వామ్యం చేయాలని బొత్సా కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+