వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడకు ఏమైనా అయితే..: చంద్రబాబుకు బొత్స హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముద్రగడ పద్మనాభంకు ఏమైనా అయితే ఆయన సామాజిక వర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్షమిస్తుందా.. అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు ప్రశ్నించారు.

తుని ఘ‌ట‌న‌లో అరెస్టు చేసిన వారిని విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తోన్న ముద్రగడ ఆరోగ్య ప‌రిస్థితిపై, ప్ర‌భుత్వం తీరుపై బొత్స ధ్వజమెత్తారు. స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేయ‌కుండా చూడాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు.

ముద్ర‌గ‌డ దీక్ష‌పై మంత్రులు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, బాధ్యతలు లేని మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. ముద్ర‌గ‌డ‌ను చూసి రావ‌డానికి వీలు లేకుండా అంక్ష‌లు పెడుతున్నారన్నారు.

Botsa warns Chandrababu Naidu over Mudragada

ప్ర‌భుత్వం గొప్ప‌ల‌కు పోవద్దని, ఒంటెద్దు పోక‌డ‌లు పోవద్దన్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రించాలన్నారు. ముద్రగడ తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా వైద్య నివేదికలు సాధారణంగానే ఉన్నాయంటూ వ్యంగ్యంగా మంత్రులు మాట్లాడుతున్నారని, ఇది సరికాదన్నారు.

ముద్రగడ ఆరోగ్య స్థితి పైన మంత్రులు, అధికారులు సరైన వివరాలు చెప్పడం లేదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవద్దన్నారు. జరగకూడనిది ఏమైనా జరిగితే అసలు కాపు సామాజిక వర్గం చంద్రబాబును క్షమిస్తుందా అన్నారు.

67 సంవత్సరాలు ఉన్న ఆయన ప్రాణానికి హాని తలపెట్టకుండా ఆయన పూర్తిగా కోలుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. ఇదిలా ఉండగా, కాపు నేతలు మరోసారి శుక్రవారం సాయంత్రం పళ్లం రాజు నివాసంలో భేటీ కానున్నారు. ఈ భేటీలో

English summary
PCC chief Botsa Satyanarayana warns Chandrababu Naidu over Mudragada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X