దారుణం: స్టూడియోకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు
చిత్తూరు: ఓ 13 ఏళ్ల అమ్మాయి కామాంధుడి వాంఛకు బలైంది. చిత్తూరు జిల్లా పీటీఎం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఈ పదమూడేళ్ల బాలిక దారుణంగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. అమ్మాయి ఓప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. నిత్యం తమ ఊరి నుంచి ఉదయాన్నే బస్సులో స్కూలుకు వెళ్లి సాయంత్రం బస్సులో తిరిగొచ్చేది.
అదే గ్రామానికి చెందిన పూజారి శ్రీనివాసులు కుమారుడు నరేష్ ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతూ అదే బస్సులో కళాశాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బాలికపై అతను కన్నేశాడు. ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తూ మాయమాటలు చెప్పి తనదారికి తెచ్చుకున్నాడు. యధావిధిగా బాలిక శుక్రవారం ఉదయం బడికి వెళ్లింది. పాఠశాలలో పుస్తకాల బ్యాగు పెట్టి పట్టణంలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో పాఠశాల సిబ్బంది బాలిక తండ్రికి సమాచారం అందించారు.

హుటాహుటిన తండ్రి అక్కడికి వచ్చి గాలించగా ఓ రోడ్డులో బాలిక కనిపించింది. పాఠశాలలోకి తీసుకెళ్లి విచారించగా తనను పూజారి నరేష్ ఓ ఫొటో స్టూడియోకు రమ్మన్నాడని, రెండుగంటల పాటు తనను స్టూడియోలో ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డాడని, తనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పక్కనే ఉన్న ఓ క్లినిక్‌కు తీసుకెళ్లి మాత్రలు ఇప్పించాడని బాలిక తెలిపింది. దీంతో తీవ్ర దిగ్ర్భాంతి చెందినతండ్రి బాలికను ఇంటికి తీసుకెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత కడుపునొప్పి మరింత తీవ్రం కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా బాలిక మరణించింది. దీంత బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక మృతి విషయం తెలియడంతో బాధిత కుటుంబంతో పాటు గ్రామం యావత్తు విషాదంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications