తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Boyakonda: బోయకొండ అభివృద్ది నా లక్షం, మూడు రాష్ట్రాల భక్తుల కోరిక అదే, మంత్రి పెద్దిరెడ్డి !

|
Google Oneindia TeluguNews

తిరుపతి/చిత్తూరు/ చౌడేపల్లె: భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా, సంతాన భాగ్యం కల్పించే సంతానలక్ష్మిగా, వ్యాపారాభివృద్ది ప్రసాదించే ప్రసన్నలక్ష్మిగా ఇలా ఎవరు కోరుకున్న కోరికలు తప్పకుండా తీర్చే గంగమ్మతల్లిగా శ్రీ బోయకొండ గంగమ్మ ప్రసిద్ది చెందింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బోయకొండ గంగమ్మను దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. బోయకొండ గంగమ్మను దర్శించుకుని మా కోరికలు తీర్చాలని భక్తులు మనసారా వేడుకుంటున్నారు. బోయకొండ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి.

మూడు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బోయకొండను ప్రముఖ పర్యాటక పుణ్య క్ష్రేత్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కంకణం కట్టుకున్నారు. బోయకొండ అభివృద్ది పనుల బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డికి అప్పగించారు. బోయకొండ ఆలయం ఈవో చంద్రమౌళి, బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ కమిటి కార్యవర్గ సభ్యులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పెద్దిరెడ్డి పనులు వేగవంతంగా పూర్తి చేయిస్తున్నారు. బోయకొండలోనే ఎక్కువగా మకాం వేస్తున్న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అభివృద్ది పనులు దగరుండి పూర్తి చేయిస్తున్నారు. బోయకొండ గంగమ్మ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ ఎప్పటికప్పుడు పెద్దిరెడ్డి చూసుకుంటున్నారు. ప్రస్తుతం బోయకొండలో వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి.

TTD: తిరుమలలో ధ్వజారోహణతో శ్రీవారి సాలకట్టు బ్రహోత్సవాలు ప్రారంభం, ప్రజలను కాపాడాలని !TTD: తిరుమలలో ధ్వజారోహణతో శ్రీవారి సాలకట్టు బ్రహోత్సవాలు ప్రారంభం, ప్రజలను కాపాడాలని !

 ఫస్ట్ టైమ్ ప్రభుత్వం తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు

ఫస్ట్ టైమ్ ప్రభుత్వం తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుమల, కాళహస్తి, కాణిపాకం తరువాత అతి పెద్ద పుణ్యక్ష్రేత్రం అయిన శ్రీ బోయకొండ గంగమ్మకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మొదటిసారి బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, బోయకొండ ఆలయం ఈవో చంద్రమౌళి ఆలయ సంప్రధాయాల ప్రకారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దంపతులకు స్వాగతం పలికారు. దసరా మహోత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.

 రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి

రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి

రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిని కరోనా మహమ్మారిని నుంచి కాపాడాలని బోయకొండ గంగమ్మ అమ్మవారిని కోరుకున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బాగాపడుతున్నాయని, రైతులు బాగా పంటలు పండిస్తున్నారని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

 ఉప ముఖ్యమంత్రి, చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప

ఉప ముఖ్యమంత్రి, చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథరెడ్డి, వెంకట్ గౌడ, కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఎంఎస్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దగ్గరుండి బోయకొండ అభివృద్ది పనులు చేయిస్తున్న పెద్దిరెడ్డి బోయకొండ గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

 బోయకొండను గతంలో నిర్లక్షం చేసిన నాయకులు

బోయకొండను గతంలో నిర్లక్షం చేసిన నాయకులు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అతి పెద్ద నాలుగవ పుణ్యక్షేత్రంగా బోయకొండ ప్రసిద్ది చెందింది. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తరువాత భక్తులు ఎక్కువగా తరలి వచ్చే పుణ్యక్షేత్రంగా బోయకొండ గంగమ్మ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిత్తూరు జిల్లా నుంచి ఎందరో నాయకులు ఉన్నత పదవుల్లో ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పని చేసినా కొందరు నాయకులు బోయకొండ గంగమ్మ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ది చేసే విషయంలో నిర్లక్షం చేశారని అమ్మవారి భక్తులు ఆరోపణలు చేస్తున్నారు.

ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి

ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు శాసన సభ్యుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చోరవ తీసుకుని బోయకొండను అభివృద్ది చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. బోయకొండను అభివృద్ది చెయ్యాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మనవి చేశారు. బోయకొండ పుణ్యక్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్ సుమారు రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసి బోయకొండ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ది చెయ్యాలని సూచించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఇప్పుడు బోయకొండ పుణ్యక్షేత్రం రూపురేఖలు మారిపోతున్నాయి.

 బోయకొండ చరిత్రలో ఫస్ట్ టైమ్

బోయకొండ చరిత్రలో ఫస్ట్ టైమ్

బోయకొండ గంగమ్మ దేవాలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. బోయకొండ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అభివృద్ది పనులు జరుగుతున్నాయి. బోయకొండ గంగాపురంలో రూ. 5 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ. 1.10 కోట్లతో సిమెంట్ రోడ్లు, రూ. 2.02 కోట్లతో భక్తుల కోసం షెండ్లు, రూ. 27 లక్షలతో కార్యాలయం పనులు, రూ. 73 లక్షలతో బోయకొండ ఆలయం సమీపంలో పుష్కరిణి, రూ. 84 లక్షలతో విద్యుత్ అధునీకరణ, కొండ మీదకు డబుల్ రోడ్డు, రూ. 18 లక్షలతో గోకులం నిర్మాణం పనులు చేపట్టారు.

 వలసపల్లె నుంచి డబుల్ రోడ్డు

వలసపల్లె నుంచి డబుల్ రోడ్డు

మదనపల్లె సమీపంలోని వలసపల్లె (బోయకొండ మార్గం) నుంచి చౌడేపల్లె వరకు రూ. 46 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు పనులు వేగవంతం చేశారు. ఇదే మార్గంలో బోయకొండ ఆలయానికి చేరుకునే భక్తులు సంచరిస్తుంటారు. బోయకొండ సమీపంలోని భవానీనగర్ నుంచి బోయకొండ ఆలయం వరకు రూ. 7.10 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి, బండ్లపై ప్రాంతంలోని ఆర్పీ గేట్ నుంచి బోయకొండ ఆలయం కార్యాలయం వరకు రూ. 5.60 కోట్ల వ్యయంతో నాణ్యమైన సిమెంట్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

 ఆర్ అండ్ బీ నిధులతో బోయకొండలో గెస్ట్ హౌస్

ఆర్ అండ్ బీ నిధులతో బోయకొండలో గెస్ట్ హౌస్

ఆర్ అండ్ బీ శాఖ నిధులు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టి బోయకొండలో అతిథి గృహం (ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్) నిర్మించనున్నారు. బోయకొండ ఆలయం సమీపంలో (కొండ మీద) రూ. 19.79 కోట్లతో సుందరమైన పార్క్, వాటర్ ట్యాంక్, మరుగుదొడ్ల తదితర అభివృద్ది పనులు జరుగుతున్నాయి. బోయకొండలోని గంగాపురంలోని అటవి శాఖ మార్గంలో భక్తులు సంచరించే వాహనాలు రాకపోకలకు 'వన్ వే' రోడ్డు పనులు జరుగుతున్నాయి.

 మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బోయకొండను ప్రముఖ పుణ్యక్షేత్రంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించామని, బోయకొండ గంగమ్మ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బోయకొండను గతంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా అభివృద్ది చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని బోయకొండ గంగమ్మ భక్తులు అంటున్నారు.

 బోయకొండలో మకాం వేసిన పెద్దిరెడ్డి

బోయకొండలో మకాం వేసిన పెద్దిరెడ్డి

బోయకొండను అభివృద్ది చెయ్యాలని కంకణం కట్టుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆశయాలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ముందుకుసాగిస్తున్నారు. ప్రతినిత్యం బోయకొండకు చేరుకుంటున్న పెద్దిరెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ దిశానిర్దేశం చేస్తూ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ సీసీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తీసుకుంటున్న చోరవను బోయకొండ గంగమ్మ భక్తులతో పాటు స్థానికులు అభినందిస్తున్నారు.

 సంతోషం వ్యక్తం చేస్తున్న నాయకులు

సంతోషం వ్యక్తం చేస్తున్న నాయకులు

బోయకొండ రూపురేఖలు ఇలా మారిపోతాయని తాము ఎన్నడూ ఊహించలేదని పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లె మండలం నాయకులు అంటున్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చోరవతో బోయకొండ ఎన్నడూ లేని విధంగా అభివృద్ది జరుగుతోందని బోయకోండ ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకరనారాయణ, మాజీ ఎంపీపీ, ప్రముఖ న్యాయవాది కూరపర్తి అంజిబాబు, బోయకొండ ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, స్థానిక నాయకులు అంటున్నారు.

 దాతల పేర్లతో వసతి గృహాలు

దాతల పేర్లతో వసతి గృహాలు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు చెందిన బోయకొండలో భక్తుల కోసం వసతి గృహాలు నిర్మించడానికి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. బోయకొండలో నిర్మించే వసతి గృహాలకు దాతల పేర్లు పెట్టాలని నిర్ణయించామని వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, బోయకొండ ఆలయం కార్యనిర్వాహణాధికారి (ఈవో) చంద్రమౌళి అన్నారు.

 వసతి గృహాలకు విరాళాలు ఇవ్వండి

వసతి గృహాలకు విరాళాలు ఇవ్వండి

రూ. 6 లక్షలు విరాళం ఇచ్చే దాతల పేర్లను వసతి గృహాలకు నామకరణం చేస్తామని, ఆ దాతలు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు బోయకొండకు వచ్చినా ఉచితంగా వసతి, దైవదర్శనం చేయించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరిస్తామని వైఎస్ఆర్ సీపీ నాయకుడు పెద్దిరెడ్డి, బోయకొండ ఆలయం ఈవో చంద్రమౌళి అన్నారు. తిరుమలలో దాతల పేర్లతో వసతి గృహాలు (కాటేజ్ లు) నిర్మించిన విధంగానే బోయకొండలో వసతి గృహాలు నిర్మించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.

 మోసపోవద్దని ఈవో మనవి

మోసపోవద్దని ఈవో మనవి

బోయకొండ ఆలయం పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి భక్తులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, బోయకొండ ఆలయం ఈవో చంద్రమౌళి భక్తులకు మనవి చేశారు. బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్దికి సహకరించాలనుకునే భక్తులు నేరుగా ఆలయానికి చెందిన బ్యాంకుకు విరాళాలు ఇవ్వాలని ఈవో చంద్రమౌళి చెప్పారు. బోయకొండ ఆలయం అభివృద్దికి సహకరించాలనుకునే భక్తులు Indian Bank, Punganur Branch, A/C No. 7010704787, IFSC Code.IDIB000P055 బ్యాంకు అకౌంట్ కు విరాళాలు ఇవ్వాలని, ఎవరి చేతులకో భారీ విరాళాలు ఇచ్చి మోసపోకూడదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, బోయకొండ అభివృద్ది పనులు పరిశీలిస్తున్న పెద్దిరెడ్డి, బోయకొండ ఆలయం ఈవో చంద్రమౌళి భక్తులకు మనవి చేశారు.

 బెంగళూరు నుంచి రూట్ మ్యాప్

బెంగళూరు నుంచి రూట్ మ్యాప్

బెంగళూరు నుంచి కోలారు, ముళబాగిలు, పుంగనూరు మీదుగా బోయకొండ పుణ్యక్షేత్రానికి సుమారు 150 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి చింతామణి, మదనపల్లె, వలసపల్లె మీదుగా బోయకొండకు సుమారు 139 కిలోమీటర్లు ఉంటుంది. ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం వేల సంఖ్యలో బోయకొండ గంగమ్మను దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తుంటారు. తమిళనాడు నుంచి వచ్చే భక్తులు చిత్తూరు, పలమనేరు, కుప్పం మీదుగా బోయకొండకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం బోయకొండలో వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. బోయకొండకు కాలినడకలో వేల సంఖ్యలో భక్తులు వెలుతున్నారు. వృద్దులు,చిన్నారులు కాలినడకలో వెళ్లడానికి గతంలో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కొండ మీదకు బోయకోండ గంగమ్మ ఆలయం సమీపంలోకి కార్లు, బైక్ లు వెళ్లడానికి అవకాశం ఉంది. బోయకొండ మీద వందలాది కార్లు, బైక్ లు పార్క్ చెయ్యడానికి పనులు వేగవంతం అయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం బోయకొండను సందర్శించిన వారు ఇప్పుడు అక్కడికి వెళితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం వేల సంఖ్యలో గంగమ్మ భక్తులు బోయకొండకు వచ్చి వెలుతున్నారు.

English summary
Boyakonda: Andhra Pradesh Miniseter for Panchayat Raj and Mines Peddireddi Ramchandra Reddy said that the Boyakonda hillock temple would be developed as one of the premier pilgrimage centres of Chittoor district. Boyakonda Gangamma in the location of temple to Gangamma Devi at Boyakonda, Andhra Pradesh. 20 km from Madanapalle and 150 km from Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X