Tirumala: హనుమంత వాహనంపై వెంకటాద్రిరామునిగా శ్రీమలయప్ప స్వామి, గోవిందా !
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా ఆరో రోజు శనివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై (hanumantha) ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
వాహనం ముందు భక్తజన బృందాలు (ttd) చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు (Brahmotsavam) సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.హనుమంత (hanumantha)వాహనం అంటే భగవత్ భక్తి ప్రాప్తి అని పురాణాలు చెబుతున్నాయి.

హనుమంతుడు (hanumantha)భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు (Brahmotsavam) వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు (hanumantha)తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.
ఈసాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు (Brahmotsavam) భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో శనివారం జరిగిన వాహనసేవలలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి. తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ అధిరాలు పాల్గొన్నారు.

విశేషంగా ఆకట్టుకున్న ఆంధ్రా, కేరళ కళా బృందాలు:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) ఆరవ రోజైన శనివారం ఉదయం హనుమంత (hanumantha) వాహనసేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు చెందిన 10 కళాబృందాలలో 275 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన చెన్నమేళం (కేరళ డ్రమ్స్) బృందంలో 25 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ (hanumantha) అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. అదేవిధంగా 25 మంది (Brahmotsavam) మహిళలు కేరళ సాంప్రదాయ వస్త్రధారణ తో తిరువాతరకలై నృత్యం చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షించారు.
తమిళనాడు రాజధాని చెన్నైకి (chennai)చెందిన శ్రీ భరత కళా అకాడమికి చెందిన 30 మంది యువతులు శ్రీ కృష్ణవైభవం నృత్యం ప్రదర్శించారు. రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మీ గణేశ భజన మండలికి చెందిన 25 మంది యువతుల జానపద (hanumantha)నృత్యం, తిరుమల (tirupati) శేష భజన మండలికి చెందిన 25 మంది కళాకారులు నవ దుర్గల వేషధారణలో దేవిస్త్రోత్రానికి అనుగుణంగా (Brahmotsavam) నృత్యం ప్రదర్శించారు. అనంతపురంకు చెందిన 15 మంది అన్నమయ్య కీర్తనలకు భరతనాట్యం ప్రదర్శించారు.
-
అరుణాచలం వెళ్తున్నారా, కీలక సమాచారం..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications