ఏపీలో బీఆర్ఎస్ - టార్గెట్ ఎవరో తేల్చి చెప్పిన కవిత..!!
ఏపీలో బీఆర్ఎస్ స్టాండ్ పై ఆ పార్టీ ముఖ్య నేత కవిత క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం జరిగింది. ఏపీకి చెందిన నేతలు పార్టీలో చేరారు. త్వరలో ఏపీలో పార్టీ అధ్యక్షుడు..తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో కాపు సమీకరణంతో బీఆర్ఎస్ అడుగులు వేస్తుందనే చర్చ సాగుతోంది. ఏపీలో రాజధాని అంశంతో పాటుగా రాష్ట్రంలోని కీలక అంశాలపైన స్పష్టత ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎంట్రీ వైసీపీకి సహకరిస్తుంనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో ఏపీలో బీఆర్ఎస్ స్టాండ్ పై ఆ పార్టీ ముఖ్య నేత కవిత క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళికలు
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ప్రకటన తరువాత ఏపీలోనూ విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏపీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖులతో కేసీఆర్ మంతనాలు జరిపారు. గతంలో జనసేనలో క్రియా శీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో పాటుగా ఐఆర్ఎస్ అధికారి పార్ధసారధి మరి కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఏపీలో మరి కొందరు ముఖ్య నేతల చేరికలు ఉంటాయని ప్రచారం సాగింది. కానీ, కొత్తగా చేరికలు లేవు. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సమయంలోనే విశాఖలోనూ బీఆర్ఎస్ సభ నిర్వహిస్తామని ఏపీకి చెందిన పార్టీ నేతలు ప్రకటించారు.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ - ఎఫెక్ట్
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ పైన ఇప్పుడు పార్టీ నేతలు ఫోకస్ చేసారు. అందులో భాగంగా కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువగా ఆ పార్టీకి దగ్గరవుతన్నారనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికల్లో కాపు సీఎం అభ్యర్ధి నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వస్తుందటూ ప్రచారం సాగింది. దీంతో..ఏపీలో టీడీపీ -జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వారిని దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపించాయి. దీని పైన అధికారికంగా పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సంబంధాల పైన చర్చ సాగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఏపీలో ఎవరికి అనుకూలం..ఎవరికి వ్యతిరేకం అనే అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
పార్టీ లక్ష్యం తేల్చి చెప్పిన కవిత
బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత తాజాగా టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో పార్టీ వైఖరి పై స్పష్టత ఇచ్చారు. ఏపీలో అయినా..యూపీలో అయినా గెలవటమే తమ ప్రాధాన్యత అని కవిత తేల్చి చెప్పారు. ఎవరి కోసమో తమ పార్టీ పని చేసే పరిస్థితి లేదన్నారు. ఎవరిని ఓడించటానికో..గెలిపంచటానికో తమ వ్యూహాలు ఉండవని.. తాము గెలవటం కోసమే తమ వ్యూహాలు అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. తమకు ఏపీలో ఏ పార్టీ మీద..ఎవరి మీద ప్రత్యేక ఇంటస్ట్రు ఉండదని స్పష్టం చేసారు. దీని ద్వారా ఏపీలో బీఆర్ఎస్ ఒంటరి పోరుకే సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఏపీ రాజధాని విషయంలో బీఆర్ఎస్ తీసుకొనే నిర్ణయం రాజకీయంగా కీలకం కానుంది.












Click it and Unblock the Notifications