ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. మూడు పార్టీల మధ్య హోరా హోరీగా సాగుతున్నాయి. డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించటం లక్ష్యంగా మరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది. అటు బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీట్లు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.
మంచి ఫలితాలు వస్తాయి
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు కాటేయబోతున్నారని వ్యాఖ్యానించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు.. ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతుంది.

ఇందులో సందేహం లేదు. ఈ రెండు ప్రభుత్వాల ఆచరణ, అవలంభించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి వెళ్లాయని చెప్పారు. వాటిని మేం చెప్పగలిగామని వివరించారు. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ పై వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్భక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేసిందని విమర్శించారు. ఎప్పుడు కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం కొలువు దీరినప్పుడు గత ప్రభుత్వం ఏ విధానాలో అవలంభించిందో ఇంటర్నల్ సమీక్షలు చేసి మెరుగైన పనితనం చూపించాలన్నారు. ఇది సహజంగా కనిపించేదేనని వివరించారు.
భిన్నంగా అసహజమైన పద్ధతుల్లో ఒక పాలసీ లేకుండా, రైతులు, ఇండస్ట్రీ, పవర్, ఇరిగేషన్ సెక్టార్‌ను పక్కన పెట్టి అమూల్యమైన సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేశారని మండిపడడారు. శాసనసభలో కూడా చిలిపి ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మూల్యం చెల్లిస్తుంది
శ్వేత పత్రాలు విడుదల చేసి, చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తులనాడటం, మాట్లాడని భాష మాట్లాడి ఒక అక్కసు వెల్లగక్కి ప్రతిపక్షాన్ని దెబ్బతీసే చిల్లర రాజకీయ ప్రయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అతి తక్కువ దృష్టి పెట్టారన్నారు.
ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతుందని జోస్యం చెప్పారు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని... ఆ ఆగ్రహాంతో పార్టీని ముంచేయడం ఖాయం అని కేసీఆర్ అన్నారు. జాతీయ పార్టీల ఓటమి స్పష్టంగా కనబుడుతుందన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications