బీటెక్ స్టూడెంట్స్ గొడవ : కత్తితో మెడపై పొడిచి పరారు
చిత్తూరు : సాయిమోహన్, శశిధర్ రెడ్డి అనే ఇద్దరు బీటెక్ విద్యార్థుల మొదలైన చిన్నపాటి ఘర్షణ.. పెద్ద వివాదానికి దారి తీసింది. మాటా మాటా పెరిగి ఇద్దరు కొట్టుకునేంత వరకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శశిధర్ రెడ్డి సాయిమోహన్ మెడపై కత్తితో పొడిచాడు. అనంతరం శశిధర్ రెడ్డి అక్కడినుంచి పరారవగా ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాగా, వీరిద్దరు బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులుగా తెలుస్తోంది. స్వల్ప వివాదం కాస్త ఘర్షణకు దారితీయగా.. సాయిమోహన్ చేతులు వెనక్కి కట్టేసి కత్తితో అతని మెడపై తీవ్రంగా దాడి చేశాడు శశిధర్ రెడ్డి. సాయిమోహన్ అరుపులు విన్న కాలేజీ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి వున్న సాయిమోహన్‌ని ఆస్పత్రికి తరలించారు. అటుపై సాయిమోహన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం సాయిమోహన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్థికపరమైన కారణాలే ఇద్దరి మధ్య గొడవకు దారి తీసి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇద్దరి స్నేహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications