వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెరాయిన్ అమ్ముతూ చిక్కిన బిటెక్ విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఈజీ మనీకి అలవాటుపడిన బిటెక్ విద్యార్థులు హెరాయిన్ అమ్మాకానికి తెగించారు. తమిళనాడులో హెరాయిన్ కొని, దాన్ని బెంగళూర్‌లో విక్రయించేందుకు తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో ఇంజనీరింగ్ విద్యార్తులు పోలీసులకు చిక్కారు.

ఆ కేసు వివరాలను అనంతపురం ఎస్పీ రాజశేఖర బాబు మీడియాకు తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు మరికొంత మంది కూడా ఈ ముఠాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడులో 13 లక్షల రూపాయలకు హెరాయిన్ కొని 60 లక్షల రూపాయలకు విక్రయించాలని అనుకున్నారని ఆయన చెప్పారు.

BTech students arrested forselling cocaine

బెంగళూర్‌కు తీసుకుని వెళ్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడడం వల్లనే వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

పోలీసులు రెండు కిలోల 469 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.

English summary

 Engineering students arrested with heroine at Ananthapur in andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X