పోటీకి దూరం: కొడాలి నానికి బుద్ధా ఆసక్తికర షరతు, జగన్‌పై బాబు ఫైర్
వైసిపి నేత కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బుధవారం నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాని ఇష్టారీతిగా మాట్లాడుతే ఊరుకునేది లేదని చెప్పారు.
అమరావతి: వైసిపి నేత కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బుధవారం నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాని ఇష్టారీతిగా మాట్లాడుతే ఊరుకునేది లేదని చెప్పారు. అంతేకాదు, నానికి ఓ విచిత్రమైన సవాల్ కూడా విసిరారు.

సరికొత్త సవాల్
రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును విమర్శిస్తే సహించేది లేదని నానికి బుద్ధా హెచ్చరికలు జారీ చేశారు. ఇరు పార్టీల నుంచి ఓ ప్రజాప్రతినిధులం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని, ఎవరు ఓడిపోతే ఆ పార్టీ 2019లో పోటీ చేయకూడదని కొత్త సవాల్ విసిరారు.

నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు
అన్యాయాన్ని అధిగమించి కసిగా అభివృద్ధి సాధించడం నవ నిర్మాణంలో కోణమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆరో రోజు నవనిర్మాణ దీక్షపై మంత్రులు, కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడం గొప్ప విషయమన్నారు.
లబ్దిదారులు, నాయకులు, అధికారులు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామం అన్నారు. జన్మభూమి, నవనిర్మాణంలో ఉన్న కోణాలు వేరని వివరించారు. గత అయిదు రోజుల దీక్షల్లో 10లక్షల మందికి పైగా పాల్గొనడం హర్షణీయమన్నారు. ప్రతి అధికారికి, నాయకుడికి ప్రజలే ముందు తారక మంత్రం కావాలన్నారు.

ఆర్థిక ఉగ్రవాదం.. మరోసారి జగన్‌పై..
తీవ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం అభివృద్ధికి అడ్డుగోడలుగా మారాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కొందరు అశాంతి, అభద్రత పెంచడం ఆందోళనకమరని, ప్రభుత్వంపై, అధికార పార్టీపై వ్యతిరేకత పెంచుతున్న ప్రతిపక్షానికి ప్రజలే సమాధానం చెప్పాలని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పేట్రేగుతోందని అమెరికా, లండన్ దుర్ఘటనలే అందుకు ఉదాహరణ అన్నారు.

వర్షాలపై హర్షం
గత రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు చెరువులు నిండి, జలాలు పెరగడంతో చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నీటితో, ప్రకృతితో ప్రజల అనుబంధం పెంపొందాలన్నారు. రాష్ట్రంలో ప్రతి చెరువును నీటితో నింపి, కట్టలు పటిష్టం చేసి, మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దేశంలో రెండో స్పెషల్ ఎంప్లాయిమెంట్ జోన్ రాష్ట్రానికే కేటాయించినట్లు తెలిపారు.

ఉద్యోగా, ఉపాధికి సువర్ణ అవకాశం
గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ల ఏర్పాటు కోసం చిత్తూరు, నెల్లూరులో భూ పరిశీలనకు ఈనెల 12న కేంద్ర బృందం రానున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ఇదొక సువర్ణావకాశమన్నారు. నెల్లూరు, చెన్నై, తిరుపతిలు ట్రైసిటీ ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారనున్నట్లు తెలిపారు. పారిశ్రామికాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే మన మహాసంకల్పమని, 8వ తేదీన నిర్వహించే మహాసంకల్ప దీక్షను విజయవంతం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications