
మా రక్తం మరుగుతుంటే .. జూనియర్ ఎన్టీఆర్ చాగంటి ప్రవచనాలు చెప్పారు; బుద్దా వెంకన్న షాకింగ్ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ జరుగుతున్న రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు కన్నీటిపర్యంతమైన ఘటన నేపథ్యంలో ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన, 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏ రోజు కన్నీరు పెట్టుకుని ఎరగరని, అలాంటి చంద్రబాబు సతీమణి పై అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు అని టిడిపి నేతలు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల బాట పట్టారు.
కొడాలి
నానీకి
దేవినేని
ఉమా
కౌంటర్
..
జగన్
కనుసన్నలలోనే
పశువుల
కంటే
హీనంగా
బూతుల
మంత్రి

జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై పెదవి విరుస్తున్న తెలుగు తమ్ముళ్ళు
జగన్ తన మంత్రులతో కావాలని చంద్రబాబుని తిట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇక వైసీపీ నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబం స్పందించింది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందన పై తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత వర్ల రామయ్య చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ దీక్ష చేపట్టి ఆ దీక్షలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పై విమర్శలు గుప్పించారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు
నారా భువనేశ్వరి పై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు మాట్లాడితే మేనల్లుడికి ఆయన సరిగా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటున్నారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. వల్లభనేని వంశీ, బూతుల మంత్రి నాని లకు ఎన్టీఆర్ అంటే భయం అని అలాంటి వారిని కంట్రోల్ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పిన వర్ల రామయ్య పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వారిద్దరిపై ఘాటుగా రియాక్ట్ అయి ఉంటే బాగుండేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న షాకింగ్ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే తాజాగా టిడిపి నేత బుద్ధ వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలు వ్యవహారాన్ని జనరలైజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం రుచించలేదు. ఈ క్రమంలోనే బుద్ధ వెంకన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. భువనేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వింటుంటే తమ రక్తం మరుగుతోంది అని వ్యాఖ్యానించారు.

చాగంటి ప్రవచనాలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ : బుద్దా వెంకన్న షాకింగ్ వ్యాఖ్యలు
కొడాలి నాని మాటలకు జూనియర్ ఎన్టీఆర్ ఏ ఆది లాగానో, సింహాద్రి లాగానో స్పందిస్తాడు అనుకుంటే చాగంటి ప్రవచనాలు చెప్పాడంటూ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలను హెచ్చరించకుండా ఎన్టీఆర్ వదిలేసినందుకు తాము ఆవేదన చెందినట్లు బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. అసలు ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించకపోయినా బాగుండేదని, స్పందించిన ఎన్టీఆర్ విషయాన్ని సూటిగా చెప్పకుండా, జనరలైజ్ చేసి చెప్పడం టిడిపి నేతలను బాధించిందని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా లు సమర్థించారు. జూనియర్ ఎన్టీఆర్ తాము ఆశించిన స్థాయిలో స్పందించలేదని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారు.