బండారం బయటపెడ్తా, రెడ్డి స్త్రీని పెళ్లాడావేం: శివప్రసాద్‌కు బుద్ధా హెచ్చరిక

చిత్తూరు లోకసభ సభ్యుడు శివప్రసాద్‌పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివప్రసాద్‌ పార్టీ మారాలంటే మారిపోవచ్చు కానీ దళితుల్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు.

విజయవాడ: చిత్తూరు లోకసభ సభ్యుడు శివప్రసాద్‌పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివప్రసాద్‌ పార్టీ మారాలంటే మారిపోవచ్చు కానీ దళితుల్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు.

మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తే తిరుమలకు వచ్చి శివప్రసాద్‌ బండారం బయటపెడతానని చెప్పారు. దళితులకు ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యం తెలుగుదేశం పార్టీ ఇచ్చిందన్నారు. బాలయోగికి లోకసభ, ప్రతిభా భారతికి అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశమిచ్చింది టిడిపియే అన్నారు.

సినిమాల్లో నటించే వ్యక్తిని తీసుకొస్తే..

సినిమాల్లో నటించే వ్యక్తిని తీసుకొస్తే..

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన శివప్రసాద్ మాట్లాడుతున్నారన్నారు. సినిమాల్లో నటించే వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై ఆరోపణలు చేయడం నీచ నైజాన్ని చాటుతోందని విమర్శించారు.

చంద్రబాబు వల్లే ఈ స్థాయి

చంద్రబాబు వల్లే ఈ స్థాయి

1999 నుంచి కేవలం చంద్రబాబు నాయుడు రెక్కల కష్టంపైనే టిడిపి మనుగడ సాగిస్తోందని, 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటానికి అధినేత కృషే కారణమన్నారు.

టిడిపి కీలక పదవులు ఇచ్చింది

టిడిపి కీలక పదవులు ఇచ్చింది

దళితులకు టిడిపి ఏమీచేయలేదనటం దారుణమని, ఒక్కసారి వెనక్కు తిరిగి చరిత్ర చూసుకుంటే మంచిదని చెప్పారు. పార్లమెంట్ స్పీకర్ స్థానం నుంచి రాష్ట్రంలో ఎన్నో కీలక పదవుల్లో దళితులకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు.

శివప్రసాద్! ఏ రోజైనా దళితుడి ఇంట్లో భోజనం చేశావా?

శివప్రసాద్! ఏ రోజైనా దళితుడి ఇంట్లో భోజనం చేశావా?

భూకబ్జాకు సంబంధించి ఫైలు పక్కన పెట్టినందునే ఆయన ఆటలు సాగక పార్టీపై, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని బుద్ధా అన్నారు. దళితులపై అంత ప్రేమే కనుక ఉంటే ఏరోజైనా ఒక్క దళితుని ఇంట్లో భోజనం చేసిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

భార్య రెడ్డి.. దళిత మహిళను పెళ్లాడలేదేం?

భార్య రెడ్డి.. దళిత మహిళను పెళ్లాడలేదేం?

తన భార్య రెడ్డి అని చెప్పుకుంటున్న శివప్రసాద్ దళిత వర్గం మహిళను ఎందుకు పెళ్లాడలేదని ప్రశ్నించారు. దళితజాతిని ఉద్ధరించిన పాపానపోని శివప్రసాద్ భూకబ్జా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలో, ప్రభుత్వంలో ఆటలు సాగనందునే విమర్శలు, ఆరోపణలకు చేస్తున్నాడన్నారు.

వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లు

వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లు

ఇతర పార్టీలపై ప్రేమ ఉంటే వెళ్లాలి గాని, ఉన్న పార్టీపై విమర్శలు సరికాదన్నారు. కాగా, ఇటీవల అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై శివప్రసాద్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆయనకు కౌంటర్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+