వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను పవన్ కళ్యాణ్ కలుస్తారా?: పచ్చిబుతులు తిట్టలేనని జనసేనాని వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Mulls JAC To Protect Andhra

న్యూఢిల్లీ: విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని సాద్యాసాధ్యాల కోసం పవన్ అందరితో మాట్లాడుతారా అనే చర్చ సాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం పవన్ మెట్టు ఎక్కేందుకైనా, దిగేందుకైనా సిద్ధంగా ఉంటారు.

నేను అలా చేసి ఉంటే: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్ కౌంటర్, బాబుకు 'అవినీతి' షాక్నేను అలా చేసి ఉంటే: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్ కౌంటర్, బాబుకు 'అవినీతి' షాక్

ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలతో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ వంటి వారితో కలుస్తానని చెప్పారు. అదే సమయంలో పార్టీలకు అతీతంగా జేఏసీ ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉద్యమించే అవకాశముందా అనే చర్చ సాగుతోంది.

చదవండి: తలుపులేసి ఏపీని విభజించారు, మీ అవమానంవల్లే ఎన్టీఆర్ పార్టీ: లోకసభలో మోడీ సంచలనం, ఎంపీలపై అసహనం

నేను ప్రజల పక్షం

నేను ప్రజల పక్షం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లోపాలు, అబద్దాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. నేను ప్రజల పక్షం కానీ, పార్టీల పక్షం కాదన్నారు. కాకినాడ సభ తర్వాత తాను పోరాటం చేద్దామనుకున్నప్పటికీ వద్దని వారించారని చెప్పారు. తెలంగాణలో ఉద్యమం సమయంలో అంతర్గత విభేదాలు ఉన్నా కలిసి పోరాడారని చెప్పారు.

పచ్చిబూతులు మాట్లాడలేను

పచ్చిబూతులు మాట్లాడలేను

పదేపదే ప్రశ్నిస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ అధికార పార్టీలను వెనుకేసుకొస్తున్నారని విమర్శలు వస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... పవన్ స్పందించారు. ధీటుగా సమాధానం ఇచ్చారు. ప్రజలు వినలేని మాటలతో, పచ్చిబూతులతో తాను మాట్లాడలేనని, విమర్శించలేనని చెప్పారు. అలాంటి రాజకీయాలు నేను చేయలేనని స్పష్టం చేశారు.

 గాంధీ నగర్ వెళ్లా

గాంధీ నగర్ వెళ్లా

మభ్యపెట్టే రాజకీయాల వల్ల యువతకు నష్టం జరుగుతోందని పవన్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పోరాటం సాగాలన్నారు. విభజన హామీలు ఎంత వరకు అమలయ్యాయని ప్రశ్నించారు. ప్యాకేజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన సమస్యలు మోడీకి చెప్పేందుకు తాను గాంధీ నగర్ వరకు వెళ్లానని చెప్పారు.

 బందుకు మద్దతు అంటూ పవన్ ట్వీట్

బందుకు మద్దతు అంటూ పవన్ ట్వీట్

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న తన విజ్ఞప్తిపై విమర్శలు రావడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒకరికి న్యాయం చేయమంటే మరొకరికి అన్యాయం చేయాలని చెప్పడం తన ఉద్దేశ్యం కాదని చెప్పారు. మరోవైపు, ఏపీ బందుకు మద్దతు పలుకుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.

English summary
Pawan said he would meet like-minded intellectuals like ex-MP Undavalli Arun Kumar and Lok Satta's Jayaprakash Narayan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X