మద్యం ప్రియులకు బడ్జెట్ షాక్ - భారీగా పెరిగి ధరలు, ఏ బ్రాండ్ ఎంత..!!

కేంద్ర బడ్జెట్ మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. 2026-27 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. 2047 విజన్.. వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. పలు సుంకాల విషయంలోనూ స్పష్టత ఇస్తూ కీలక ప్రకటనలు చేసారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై సుంకాలను తగ్గించింది. అయితే, ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో.. బ్రాండెడ్ మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27 ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ప్రధాన రంగాలకు కేటాయింపులను పెంచింది. రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది. పలు సుంకాల విషయంలోనూ నిర్ణయాలు తీసుకుంది. ఇన్ కం టాక్స్ విధానం అమలు పైనా స్పష్టత ఇచ్చారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది.

Budget 2026 The TCS rate on alcoholic liquor for human consumption as well as on scrap and minerals

ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది. గతంలో ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్‌పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాలలోని సెల్లర్స్‌కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది. దీంతో, మద్యం ప్రీమియర్ బ్రాండ్లతో పాటుగా ఇంపోర్ట్ చేసుకునే లిక్కర్ ధరలు పెరగనున్నాయి.

సుంకాల పై నిర్ణయంతో

కాగా, ఈ నిర్ణయం సెల్లర్లకు పెను భారం తగ్గనుంది. ఈ ప్రకటనతో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ బిజినెస్ ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆల్కహాల్ సెల్లర్లకు మంచి జరిగినా.. మద్యం తాగే వారికి మాత్రం నష్టం తప్పేలా లేదు. ఇకపై మద్యం రేట్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం ఆల్కహాల్ రేట్లు మాత్రమే కాదు.. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది.

వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను తగ్గించింది. చదువులు, వైద్యంపై టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి తాము నిర్దేశించుకున్న టార్గెట్ కు అనుగుణంగా ఉందని ప్రధని మోదీ ప్రశంసించారు. కాగా, విపక్షాలు మాత్రం బడ్జెట్ పైన విమర్శలు కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+