Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ దారుణం, అందుకే బీజేపీ ఓడింది: మోడీకి బాబు దెబ్బ, 'అమిత్ షా మాటల్లో ధైర్యం'

అమరావతి: అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటి వాడిగా వేడిగా సాగింది. టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నేతలకు విభజన నాటి పరిస్థితులు, బీజేపీతో పొత్తు తదితర అంశాలపై భేటీకి హాజరైన నేతలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించినందువల్లే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని, బీజేపీ న్యాయం చేస్తుందని పొత్తు పెట్టుకున్నామని వివరించారు.

 బీజేపీకి బాబు చురకలు

బీజేపీకి బాబు చురకలు

నాలుగో బడ్జెట్‌లోను బీజేపీ న్యాయం చేయలేదని చంద్రబాబు నేతలతో ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా విభజన చేయడం వల్లే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. బీజేపీ మేలు చేస్తుందని భావించామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని దెబ్బతీసేందుకే విభజన చేశారన్నారు.

 ప్రజలు ఉపేక్షించరు.. బీజేపీ ఓడిపోయింది

ప్రజలు ఉపేక్షించరు.. బీజేపీ ఓడిపోయింది

ఆనాడు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌తో అధికార కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకుందని చంద్రబాబు ఆరోపించారు. పరిపాలన బాగుండకపోతే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరని బీజేపీని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఇందుకు ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. రాజస్థాన్ ఉప ఎన్నికలే అందుకు ఉదాహరణ అన్నారు. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయం విషయం తెలిసిందే.

 బడ్జెట్ దారుణంగా ఉంది, ఏపీ పట్ల చిన్న చూపు ఎందుకు

బడ్జెట్ దారుణంగా ఉంది, ఏపీ పట్ల చిన్న చూపు ఎందుకు

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు నేతలతో చెప్పారు. నిన్నటి బడ్జెట్ చాలా దారుణంగా ఉందన్నారు. మేలు చేస్తుందనుకుంటే అలా చేయలేదన్నారు. అహ్మదాబాద్, కర్నాటక, మహారాష్ట్రలకు భారీగా నిధులు ఇచ్చారన్నారు. మరి ఏపీ పట్ల ఇంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.

 బీజేపీతో ఎలా అని ఎంపీలు అడుగుతున్నారు

బీజేపీతో ఎలా అని ఎంపీలు అడుగుతున్నారు

ఏపీ పట్ల కేంద్రం ఇలాగే వ్యవహరిస్తుంటే, మనం బీజేపీతోనే కలిసి సాగితే మనం ప్రజల్లోకి ఎలా వెళ్తామని మన ఎంపీలు తనను అడుగుతున్నారని చంద్రబాబు నేతలతో అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాలు జరుపుకోలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

సాక్షి కథనంపై ఆగ్రహం

సాక్షి కథనంపై ఆగ్రహం

మీడియా అంతా ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని రాసిందని, కానీ వైసీపీ అధినేత వైయస్ జగన్ సాక్షి మాత్రం తప్పుడు కథనాలు రాసిందని మండిపడ్డారు. టీడీపీ వల్లే ఏపీకి రాసిందని రాయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమను విమర్శించే ముందు ప్రతిపక్షం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. బడ్జెట్ చూశాక ఎంపీలు బాధపడ్డారన్నారు. కొత్తగా ఏర్పాటయిన ఏపీకి కేటాయింపులు లేకపోవడం ఏమిటన్నారు.

అమిత్ షా మాటల్లో ఆ ధైర్యం

అమిత్ షా మాటల్లో ఆ ధైర్యం

చంద్రబాబు మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు మాట్లాడుతూ.. ఏపీకి హామీలు నెరవేర్చామనే అభిప్రాయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందని చెప్పారని తెలుస్తోంది. నిన్న బడ్జెట్ అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాటల్లో అదే కనిపిస్తోందని చెప్పారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+