మార్చి 5న గవర్నర్ ప్రసంగం...8న బడ్జెట్:సిఎం చంద్రబాబు వెల్లడి

అమరావతి: ఎపి సచివాలయంలో వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులు, మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనపై ఆయన ఈ సమావేశంలో చర్చించారు. మార్చి 5న గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని, మార్చి 8న రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడతామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.

తొలుత మార్చి12 నుంచి సమావేశాలు పెట్టాలని భావించినప్పటికీ, తెలంగాణలో కూడా అదే రోజున అసెంబ్లీ ప్రారంభమయ్యేటట్లు కనిపిస్తుండటంతో, ఎపి బడ్జెట్ సమావేశాలు అంతకంటే ముందు నుంచే ప్రారంభించాలని, అందుకే మార్చి 5 నుంచి సభ ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. కారణం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించాల్సి ఉన్నందున రెండు రాష్ట్రాల మధ్య ఈ విషయమై సమస్యలు తలెత్తకుండా చూసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

Budget Session on March 8

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ ఇదే కావడంతో ఈ బడ్జెట్ పై సహజంగానే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఎలక్షన్స్ ముందు బడ్జెట్ కాబట్టి కేటాయింపుల విషయంలో ఓటు బ్యాంకు గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+