చంద్రబాబు, పవన్ కు ప్రాధాన్యత దక్కేనా - మోదీ లెక్కలేంటి..!!
కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకు వస్తోంది. ఈ రోజు పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ 2024-25ను ప్రతిపాదించనుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా ఉంది. రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వచ్చింది. దీంతో, కేంద్రం నుంచి భారీ తోడ్పాటు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఏపీకి కావాల్సిన వాటి పైన చంద్రబాబు కేంద్రానికి నివేదించారు. మరి..బడ్జెట్ లో కేంద్రం ఏపీకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి. నిధులు లెక్కలు ఎలా ఉంటాయి.
కేంద్ర బడ్జెట్
కేంద్రం ఈ రోజు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. కేంద్రంలో..ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీకి మేలు జరుగుతుందని ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు హామీలు ఇచ్చారు. కేంద్రం నుంచి ఆశిస్తున్న వాటి పైన చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా..వరుసగా కేంద్ర మంత్రులను కలిసి వివరించారు. ప్రత్యేకంగా అమరావతి..పోలవరం పైన కేంద్ర సాయం పైన ఏపీ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. రాజకీయంగానూ బడ్జెట్ కేటాయింపులు కీలకంగా మారనున్నాయి.

ఏపీ వినతులు
బడ్జెట్‌లో రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి రాజధాని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్మాణదశలో ఉన్న రైల్వేప్రాజెక్టులు, గతంలో మంజూరై ఇంకా అడుగు ముం దుకుపడని రైలుమార్గాలు, రహదారులకు నిధుల కేటాయింపుపై అందరూ ఆశలు పెట్టుకొన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఆర్దికంగా సాయం అందించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. 2014-19 కాలంలో కేంద్రం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ముఖ్య భవనాల నిర్మాణాల కోసం రూ 1500 కోట్లు..భూగర్బ డ్రైనేజీ కోసం మరో రూ 1000 కోట్లు కేటాయింపులు చేసింది.
కేంద్రం కేటాయింపులు
ఇప్పుడు అమరావతిలో రిండ్ రోడ్ కోసం కేంద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ కేటాయింపులను బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు నిదులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా పోలవరం కోసం ఏపీ ప్రభుత్వం సవరించిన అంచనాలతో పాటుగా పునరావాస ప్యాకేజీ మంజూరు చేయాలని కోరుతోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ మద్దతు...ఏపీలో గెలుపు వెనుక పవన్ సామర్ధ్యం గురించి ప్రశంసలు కరిపించిన ప్రధాని మోదీ..ఇప్పుడు కేంద్ర కేటాయింపుల్లో ఏపీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications