తప్పుడు లెక్కలతో బురిడీ కొట్టించాలని చూస్తున్నారు: యనమలపై ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలు
అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై తరచూ విమర్శలు ఎక్కుపెడుతున్న మాజీ ఆర్తిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు యనమలపై బుగ్గన మండిపడ్డారు. శుక్రవారం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కరోనా మహమ్మారికి ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 7.23 శాతం వృద్ధి ఉన్నట్లు కొత్త చిట్టా విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో 7.91 శాతం ; పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారు. 2020 - 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ ర్యాంకు వచ్చినట్లు గుర్తు చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో 5, 6 స్థానాల్లో నిలిచామన్నారు. తప్పుడు లెక్కలతో యనమల ప్రజలను బురిడీ కొట్టించలేరంటూ ఘాటుగా స్పందించారు బుగ్గన.బాధ్యత లేని ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆర్థికమంత్రి బుగ్గన మండిపడ్డారు.

. మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర జీఎస్డీపీ కూడా క్షీణిస్తూ వచ్చిందన్నారు. టీడీపీ చూపించిన నిరుద్యోగ రేటుపైనా ఆయన మండిపడ్డారు. యనమల పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ లెక్కల ప్రకారం నిరుద్యోగ రేటు 6.5శాతమో చెప్పాలన్నారు. 2018-19లో 5.7శాతమున్న నిరుద్యోగ రేటు.. 2019-20 కల్లా 5.1శాతానికి దిగొచ్చిందన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో అప్పులే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు యనమల. వృద్ధిరేటు పడిపోయిందన్నారు.. దీనికి కౌంటర్‌గానే లెక్కలతో సహా వివరాలు వెల్లడించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
Recommended Video
కాగా, ఇటీవల ఏపీ సర్కారుపై యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడని విషయం తెలిసిందే. అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఏపీలో ఆర్థిక అసమానతలు 32 శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని యనమల ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రానికి రెండున్నరేళ్లుగా అప్పులే తప్ప ఆదాయ మార్గాలు లేవని, తెచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేదని యనమల మండిపడ్డారు.
అప్పు తెచ్చిన రూ. 2.68 లక్షల కోట్లలో రూ. 1.05 లక్షల కోట్లు సంక్షేమం కోసమని రాష్ట్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారని.. వాస్తవంగా ఖరచు చేసింది రూ. 68 వేల కోట్లేనని యనమల రామకృష్ణుడు తెలిపారు. కేపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం రూ. 31వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన రూ. 1.68 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని, ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు యనమల. గత టీడీపీ ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. వైసీపీ 5 పథకాలు మాత్రమే తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాలపై ఖర్చులో దేశంలోనే రాష్ట్రం 18వ స్థానంలో నిలిచిందని యనమల వ్యాఖ్యాంచారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications