ఓట్లు వేసింది ఇందుకేనా... బోత్సను నిలదీసిన భవన కార్మికులు

ఏపీలో ఇసుక సమస్య ఆందోళనలను రోజురోజుకు తీవ్ర అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇసుక సెగ ఏపి మంత్రులను సైతం తాకుతోంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలపడంతోపాటు మంత్రులను నిలదీస్తున్నారు. కొరత కారణంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈనేపథ్యంలోనే మంత్రులను అడ్డగించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈనేపథ్యంలోనే గుంటురు జిల్లాలో పర్యటిస్తున్న మున్సిపల్‌శాఖ మంత్రి బోత్స సత్యనారాయణను కార్మికులు నిలదీశారు. ఇసుక కొరత కారణంగా పనులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా అంటూ బోత్సను నిలదీశారు. మరోవైపు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. అయితే ఇసుక సమస్యపై కొన్ని పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అరోపించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామి ఇచ్చారు.

Building construction labour protest in front of the ministers in ap

గత కొద్ది రోజులుగా ఇసుక లభించకపోవడంతో కార్మికులు రోడ్డుపడుతున్న నేపథ్యంలోనే ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా, తాజాగా కార్మికులు నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమయ్యారు. దీంతో ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులను అడ్డగించి తమ నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బోత్సను అడ్డగించడంతో పాటు అటు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. కాగా సమస్య తీరలేని పరిస్థితుల్లో తమ ఆందోళనను మరింత ఉదృతం చేసేందుకు కూడ కార్మికులు సిద్దం అవుతున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+