ఏపీలో ఆ మహిళలకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.7వేలు ప్రోత్సాహకం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని, దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది.

గ్రామీణ మహిళలకు తోడ్పాటు అందించేలా బీమా సఖి యోజన
ఏపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూడా వినూత్న పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రామీణ మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించే విధంగా బీమా సఖి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చే ఎల్ఐసి తో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుని గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులోని మహిళలకు ఆర్థిక భరోసా అందించనుంది.

Bumper offer for those women in AP Rs 7 thousand per month incentive for bima sakhi

Take a Poll

మహిళలను ఎంపిక చేసి శిక్షణనిచ్చి బీమా సఖిగా నియామకం
ఈ కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో ఏపీఎం, డిపిఎం లను అధికారులుగా నియమించి ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.ఈ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపుల లోని మహిళలను ఐఆర్డిఏ మార్గదర్శకాలకనుగుణంగా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి బీమాకు సంబంధించి ప్రత్యేక శిక్షణను ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ధ్రువపత్రాలను కూడా అందించి వారి ద్వారా గ్రామాలలో ప్రజలకు బీమా గురించి అవగాహన కల్పిస్తారు.

వీరికి ప్రోత్సాహకాలు ఇలా
వీరు ఎల్ఐసి లో పనిచేసినప్పటికీ వీరిని ఎల్ఐసి ఉద్యోగులుగా పరిగణించరు. ఈ మహిళలు కేవలం కెరీర్ ఏజెంట్లుగా మాత్రమే పని చేస్తారు. వీరి పనితీరు ఆధారంగా వీరికి స్టయిఫండ్ అందిస్తారు. బీమా సఖిగా ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు 7000 రూపాయలు, రెండవ సంవత్సరం నెలకు 6000 రూపాయలు, మూడవ సంవత్సరం నుండి నెలకు 5000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తారు.

వారికి బోనస్ , కమీషన్ కూడా
వీరంతా సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది. అదనంగా వారికి బోనస్, కమిషన్ కూడా లభిస్తుంది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఈ పథకం ద్వారా కూటమి సర్కార్ కృషి చేస్తుంది.ఇక ఈ పథకంపై ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఈ పథకం పొందాలంటే అర్హతలు ఇవే
18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు, డ్వాక్రా గ్రూపు మహిళలే ఈ పథకానికి అర్హులు. ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ బీమా సఖి పథకానికి అనర్హులు. అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు, ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. డ్వాక్రా గ్రూప్ మహిళ అయి ఉండి ఇప్పటివరకు ఏ పథకం ద్వారా ఉపాధి పొందకుండా ఉన్న మహిళలు దీనికి అప్లై చేసుకోవచ్చు.

ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం

ఈ పథకం పై ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు, ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ బీమా సఖి పథకానికి అనర్హులు. అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు, ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. డ్వాక్రా గ్రూప్ మహిళ అయి ఉండి ఇప్పటివరకు ఏ పథకం ద్వారా ఉపాధి పొందకుండా ఉన్న మహిళలు దీనికి అప్లై చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+