వడ్డీ వ్యాపారి దారుణ హత్య: సెప్టెక్ ట్యాంకులో మృతదేహం
కాకినాడ: నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వడ్డీ వ్యాపారి కేసును పోలీసులు ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం గుడివాడ గ్రామానికి చెందిన వడ్డ వ్యాయపారి పోతంశెట్టి విష్ణు ఈశ్వరులు అలియాస్ వాసుదేవ (50) హత్యకు గురయ్యాడు.
గోకవరం మండలం తిరుమాలాయపాలెం గ్రామంలో మాం వ్యారం చేస్తున్న షేక్ వల్లీకి చెందిన ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతిలో అతని మృతదేహం కనిపించింది.

ఇలా చెప్పి, హత్య
పైనాన్స్ సొమ్ము వసూలు కోసం ఈ నెల 23వ తేదీన తిరుమలాయపాలెం వచ్చిన విష్ణు ఈశ్వరులును షేక్ వల్లీ హత్య చేసినట్లు గుర్తించారు. నగదు చెల్లిస్తానని చెప్పి ఇంటికి పిలిచిన షేక్ వల్లీ కత్తితో ఈశ్వరులును తలపై నరికి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అనుమానం రాకుండా ఇలా చేశాడు...
హత్య చేసిన తర్వాత ఈశ్వరులు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ గోతిలో పూడ్చి అనుమానం రాకుండా మూత వేశాడు. హత్యకు వాడిన కత్తిని నిందితుడి ఇంటి మిద్దెపై, మృతుడి ఫైనాన్స్ లెక్కలకు సంబంధించిన పుస్తకాన్ని బాత్రూంపై కనుక్కున్నారు.

మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి...
ఈశ్వరులు మృతదేహాన్ని ఇంటిలోంచి గోతి వరకు ఈడ్చుకెల్లిన రక్తం మరకలు, గోడపై ఉన్న రక్తం మరకలను పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి ఇంటి ఆవరణలో ఉన్న గోతిలోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇలా వెనకంజ వేసారు..
పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు, గుడివాడ గ్రామ ప్రజలు కూడా పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉంది. పైగా రాత్రి సమయం. దీంతో మృతదేహాన్ని వెలికి తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

బైక్ ఇలా కనిపించింది..
మృతుడి బైక్ జగ్గంపేట మండలం రాజపూడి శివారులోని పుష్కర కాలువ గట్టున కనిపించింది. దీంతో షేక్ వల్లీ ఒక్కడే అతన్ని హత్య చేశాడా, ఇతరుల పాత్ర కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానంతో కుటుంబ సభ్యులు షేక్ వల్లీ ఇంటి చుట్టూ అంతకు ముందు గాలించారు. శుక్రవారం ఇంటి ఆవరణ నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications