మిఠాయి దుకాణం వ్యాపారి దారుణ హత్య: వరుస చోరీల దొంగ అరెస్టు

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని తగరపువలసలో దారుణ హత్య జరిగింది. రామ్‌సింగ్ అనే వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. శుక్రవారం సాయంత్రం బాణాసంచా కొనుగోలు చేసేందుకు రూ. నాలుగులక్ష తీసుకుని రామ్‌సింగ్ ఇంటి నుంచి బయలుదేరాడు.

అయితే ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మృతదేహం రామ్‌సింగ్‌దే అని తేలడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Businessman killed in Visakhapatnam district

రాజస్థాన్‌కు చెందిన 27 ఏళ్ల రాంసింగ్ వెల్లంకిలో మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం సాయంత్రం పది తులాల బంగారం, నాలుగు లక్షల రూపాయలను దోపిడీ చేసేందుకే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అతన్ని గొంతు కోసి హత్య చేశారు.

వరుస చోరీల దొంగ అరెస్టు

ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు శుక్రవారం అర్థరాత్రి గస్తీ తిరుగుతున్ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి గస్తీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన రామాచారి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతని నుంచి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+