బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గృహ నిర్బంధం: కర్నూలులో ఉద్రిక్తత
కర్నూలు జిల్లాలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు బతుకు దెరువు యాత్ర, కలెక్టరేట్ ముట్టడికి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధినేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లాలోని తంగడంచ మండలంలో పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు నిరసనగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోమవారం తంగడంచ నుంచి కర్నూలు వరకు ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు.

ఈ యాత్రలో పాలుపంచుకునేందుకు పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కర్నూలులోని బైరెడ్డి నివాసానికి చేరున్నారు. కాగా, ఓవర్లకల్లు, జూపాడుబంగ్లా మండలాల్లో రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
యాత్రకు అనుమతివ్వని ప్రభుత్వం, శాంతిభద్రతల పేరు చెప్పి బైరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచింది. ఓ వైపు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్న క్రమంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications