వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని రగడ: మూడు పార్టీలకు బైరెడ్డి హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar Reddy
కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి కర్నూలును రాజధానిగా ఎంపిక చేయించలేని పక్షంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్ నాయకుల రాజకీయ జీవితానికి ప్రజలు సమాధి కడతారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. రాయలసీమ రణభేరి పేరుతో కర్నూలులోని శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ సభ నిర్వహించారు.

రాష్ట్రం విడిపోతే అత్యధికంగా నష్టపోయేది రాయలసీమేనన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని రాయలసీమ కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రంలోనూ అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలకు లేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కర్నూలును రాజధానిగా చేయడం ఒక్కటే మార్గమన్నారు.

కర్నూలును రాజధానిగా చేయడం అన్నది కొత్తగా వచ్చిన డిమాండ్ కాదన్నారు. గతంలో ఉన్న రాజధానిని త్యాగం చేసిన రాయలసీమ వాసులు ఆ తరువాత అడుగడుగునా మోసానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోసపోవడం సాధ్యం కాదని రాయలసీమ హక్కుల కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మరో కొత్త మోసంతో నాయకులు ముందుకు పోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో చెలరేగుతుందని హెచ్చరించారు.

English summary
Rayalaseema leader Byreddy Rajasekhar Reddy demanded make kurnool as capital to the Seemandhra state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X