చీఫ్ విప్‌లు పల్లె, పయ్యావులకు కేబినెట్ హోదా, ఉత్తర్వులు జారీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ, మండలిలో చీఫ్ విప్‌లు పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌లకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. దీంతో ఆయన 2020 జనవరి 17 వరకు ఉండనున్నారు.

కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్‌లో సభ్యుడి పదవికి రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమ్ చంద్ వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా సమర్పించారు.ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.












Click it and Unblock the Notifications