హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పక్కా ప్లాన్‌తో టి: చివరిదాకా గోప్యతపై కావూరి నిలదీత!

By Srinivas
|
Google Oneindia TeluguNews

t on Telangana
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్ పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం చివరి వరకు గోప్యత పాటించినట్లుగా కనిపిస్తోంది. గురువారం కేబినెట్‌కు తెలంగాణ నోట్ వస్తుందని ఉదయం నుండే జోరుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఎపి వ్యవహారాల అధ్యక్షులు దిగ్విజయ్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు భిన్నంగా స్పందించారు. తద్వారా టి నోట్ వస్తుందని తొలుత భావించినా ఆ తర్వాత అనుమానాలు తలెత్తాయి.

అంతేకాకుండా కేబినెట్ మంత్రులకు నోట్ పంపిణీ చేసినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఎవరికి పంపిణీ చేయలేదని సమాచారం. కేబినెట్ సమావేశం మరో గంటలో ఉందనగా మాత్రమే స్పష్టత వచ్చింది. సుశీల్ కుమార్ షిండే చివరి దాకా అంతులేని గోప్యత పాటించారు. సాయంత్రం 5.30 గంటలకు కేబినెట్ సమావేశం మొదలుకానుండగా అంతకు రెండుమూడు గంటలముందు షిండే మీడియాతో మాట్లాడారు.

మధ్యాహ్నం రెండు గంటల వరకు నోట్‌పై తాను సంతకం పెట్టలేదని, తెలంగాణపై నోట్‌ను తాము ఎప్పుడో తయారు చేశామని అయితే, దానికి సంబంధించి తనకు సూచనలు రాలేదని, తాను ఇంత వరకూ నోట్‌పై సంతకం కూడా చేయలేదన్నారు. కానీ మీడియా మాత్రం అది మంత్రులకు పంపిణీ అయ్యిందని, అదనీ ఇదనీ ఏదేదో ప్రచారం చేస్తోందని షిండే అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నారా? అని ప్రశ్నించగా.. ఇంకా తాను సంతకమే చేయలేదని, సంతకం చేస్తే ఇవన్నీ నిర్ధారణ అవుతాయన్నారు.

అనంతరం షిండే తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో నోట్ కేబినెట్‌కు వస్తోందంటూ ప్రసారమవుతున్న వార్తల గురించి విలేకరులు ప్రస్తావించగా.. అవన్నీ ఊహాగానాలే అని షిండే కొట్టిపారేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయనే మీడియా ముందుకు వచ్చి నోట్‌ను మంత్రివర్గం ఆమోదించిన సంగతి చెప్పారు. కేబినెట్ సమావేశానికి కొద్దిముందు ఆయన సంతకం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

కేబినెట్ నోట్ అంశం రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులకు కూడా తెలియదని తెలిస్తోంది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. లేని అంశాన్ని టేబుల్ అంశంగా ఎలా తీసుకు వచ్చారని, తమకు ఇది అంగీకారంకాదని కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు భేటీలో చెప్పినప్పటికీ వారి వాదనను ఎవ్వరూ లక్ష్యపెట్టలేదట.

English summary

 The Union Cabinet on Thursday decided in principle to create the 29th state of the Indian Union by carving out from AP the state of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X