అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు, గన్నవరం సహా - కీలక మార్పులు, ఆపరేషన్ 2029..!!
ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు కీలక దశకు చేరుకుంది. జిల్లాలతో పాటుగా రెవిన్యూ డివిజన్లు పెరగనున్నాయి. మండలాల సంఖ్య పైన చర్చలు జరుగుతున్నాయి. అదే సమయం లో అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు అంశం కీలకంగా మారుతోంది. మంత్రివర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. సర్దుబాటు కానున్న నియోజకవర్గాల్లో కీలక సెగ్మెంట్లు ఉన్నాయి. 2029 ఎన్నికల్లో ఈ నిర్ణయాలు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీ కరణపై మంత్రివర్గ కసరత్తు జరుగుతోంది. జగన్ హయాంలో ఏపీలో 13 జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 26కు పెంచారు. కాగా.. వీటి పైన పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. దీంతో... జిల్లాల తో పాటుగా మండలాల విషయంలోనూ మార్పుల పైన నాడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే అంశం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కసరత్తు చేస్తోంది. వినతులను స్వీకరిస్తోంది. మార్పుల దిశగా ప్రతిపాదనలకు సిద్దమైంది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాలను పొరుగున ఉండే జిల్లాలో విలీనం దిశగా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ప్రతిపాదనల్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కాగా, విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా మార్కాపురం, మదనపల్లెలను కొత్త జిల్లాల కేంద్రాలుగా చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని ప్రతిపాదనలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనలపైన ఈ రోజు జరిగే మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించనున్నారు. 10వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా చూడాలనే అంశంపై పునరాలోచిస్తున్నారు. జనగణన నేపథ్యంలో డిసెంబరు నెలాఖరులోగా ఈ ప్రక్రియ ముగించాలి. అదే సమయంలో రాజకీయంగానూ కసరత్తు చేసిన తరువాత కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల సర్దుబాటు పైన తుది నిర్ణయం వెల్లడించనున్నారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..!












Click it and Unblock the Notifications