చంద్రబాబుతో నేరుగా, ఇటు కేసీఆర్ 'ఫిక్స్' - రేవంత్ అనూహ్య నిర్ణయం..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. పాలనా పరంగా- రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో కీలక అంశాల పైన చర్చ చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టు పైన నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుతోనే చర్చించాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా బీఆర్ఎస్ లో నెలకొన్ని తాజా పరిస్థితులు.. వెంటాడుతున్న విచారణల వేళ.. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కేసీఆర్ ను ఫిక్స్ చేసేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు.

చంద్రబాబుతో చర్చలు
ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో బనకచర్ల అంశం పైన ప్రధాన చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ అంశం పైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు స్పందించారు. తమ వైఖరి స్పష్టం చేసారు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రాజకీయంగా తెలంగాణలో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. ఈ రోజు జరిగే భేటీలో మంత్రివర్గ సహచరులకు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ లక్ష్యం ఏంటి... కేంద్రం ఏ ఆలోచన చేస్తుందీ.. తెలంగాణ ప్రభుత్వ విధానం పైన మంత్రులకు సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వనున్నారు. ఇక, నేరుగా చంద్రబాబును ను ఈ అంశం పైన చర్చలకు ఆహ్వానించాలని రేవంత్ భావిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం ద్వారా ఈ సమస్య పైన ఒక నిర్ణయానికి రావాలనేది సీఎం రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది.

cabinet-to-take-key-decision-over-banakacharla-and-on-local-body-elections

స్థానిక సమరం
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రోజు జరిగే కేబినెట్ లో భేటీలో ఈ ఎన్నికలతో పాటుగా సర్పంచి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా? పాత రిజర్వే న్ల ప్రకారమే ఈసారికి ముందుకెళ్లాలా అనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కేసీఆర్ ఫిక్స్..
రాజకీయంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం ఇప్పటికే చిక్కుల్లో ఉంది. కాళేశ్వరం కమిషన్ విచార కు కేసీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక, పార్టీలో అంతర్గతంగా సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో.. రాజకీయంగా మరింత పట్టు బిగించే విధంగా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కేబినెట్ భేటీలో సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. దీంతో.. రాజకీయంగా ఈ రోజు జరిగే కేబినెట్ భేటీ కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+