Vidadala Rajini:చిలకలూరిపేట చిన్నమ్మకు వైసీపీ క్యాడర్ షాక్..!!
Vidadala Rajini:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ టైంలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఆమె. కంటెంట్ తో కంటే కటౌట్ తో కొట్టడం ఆమె నైజం. పార్టీ అధినేత దృష్టిలో పడాలని ఎప్పుడూ తాపత్రయం. జిల్లాలో ఉన్నసీనియర్లందరు నేనే బాస్ అనే రేంజ్ లో బిల్డప్.. అనుకోకుండా వచ్చిన మంత్రి పదవి. ఇకేముంది రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా మోత మోగింది. రీల్స్, పిక్స్ తో ప్రచారం పీక్స్ లోకి వెళ్లింది. కానీ కాలం పగబట్టేసింది. ఎంత త్వరగా లేపిందో అంతే త్వరగా భారీ ఓటమిని రుచిచూపించింది.
విడదల రజిని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్టార్ రేంజ్ లో ఎదిగిన వ్యక్తి.. అధినేత ఆశిస్సులు.. నంబర్ 2 ప్రోత్సాహం కలగలిపి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా అతి తక్కువ రాజకీయ అనుభవంతో బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. బీసీ మహిళా అని చెప్పుకుంటూనే జిల్లాలో ఉన్న అగ్ర నాయకత్వాన్ని మానవత్వం కూడా లేకుండా తొక్కి పడేశారని సమాచారం. ఇక నమ్మించి గెలిపించిన చిలకలూరిపేట ప్రజానీకాన్ని పీల్చిపిప్పి చేసింది ఆమె కార్యాలయం. ఆమె గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడితే చాలు... ఇష్టానుసారం సోషల్ మీడియాలో విరుచుకుపడిన వర్గం ఒకటైతే.. చెప్పిన పని చేయకపోయినా... వాటాలు పంపకపోయినా పోలీసులతో కొట్టించిన పీఏల వర్గం మరొకటి.

కలిసొచ్చిన సీటుపైనే కన్ను
పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయాలు 2017 నుంచి చాలా మారిపోయాయి. అప్పటి వరకు పేటలో రాజకీయం అంటే రెండే పేర్లు వినిపించేవి. ఒకటి పత్తిపాటి పుల్లారావు, మరోటి మర్రి రాజశేఖర్. ఇద్దరూ బలమైన నాయకులే, దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్నవారే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ముందుగా రజిని.. నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు తో సఖ్యతగా ఉంటూ తెలుగుదేశం అధినాయకత్వం దృష్టిలో పడింది. మహానాడు వేదికగా జగన్ పై నిప్పులు చెరిగింది. 2019 కి వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు కోసం వైసీపీలో చేరారు. అప్పటి వరకు ఇన్చార్జ్ గా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. గెలిచేంత వరకు నాన్న నాన్న అంటూ తిరిగి.. గెలిచిన తర్వాత నా ఇష్టం అనడం ప్రారంభించారు.
పార్టీలో అగ్రనాయకత్వం సహకారంతో మంత్రి వర్గ విస్తరణలో అనూహ్యంగా వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే నియోజకవర్గంలో పార్టీ రెండు గా చీలిపోయింది. మర్రి వర్గం, రజిని వర్గంగా అంతర్గత కుమ్ములాట అధిష్టానం వద్దకు వెళ్లినా.. పార్టీ పెద్దలు రజిని వైపై స్టాండ్ తీసుకున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో విపరీతంగా పెరిగిపోయిన వ్యతిరేకతను ముందే పసిగట్టిన రజిని.. జగన్ ను అడిగి మరి మకాం గుంటూరుకు మార్చుకుంది. అయితే అక్కడ కూడా ఘోర పరాభవం తప్పలేదు. 50వేల మెజార్టీతో తొలిసారి పోటీ చేసిన గళ్లా మాధవి గెలుపొందారు.
తాజాగా విడదల రజిని తన అభిప్రాయం మార్చుకున్నారు. అదృష్టం కలిసివచ్చిన చిలకలూరిపేటకే ఇన్చార్జ్ గా వెళ్లాలని భావించారు. రజిని అడగటం, జగన్ కాదనంటూ చరిత్రలోనే లేదు. దీపావళి లోపు తనను చిలకలూరిపేట ఇన్చార్జ్ గా ప్రకటించే అవకాశం ఉందనే సమాచారాన్ని నియోజకవర్గానికి అందించింది. ఈ సమయంలోనే చిలకలూరిపేట వైసీపీ క్యాడర్ అలర్డ్ అయింది. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతూ పెద్దతలకాయగా ఉన్న మర్రి రాజశేఖర్ ను పేట ఇన్చార్జ్ గా నియమించాలనే డిమాండ్ ను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.

ఒకే వేదికపై పుల్లారావు, మర్రి రాజశేఖర్
20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ ఒకే వేదికపై కనిపించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన పరేడ్ కు.. చిలకలూరిపేట ఎమ్మెల్యే హోదాలో పుల్లారావు, ఎమ్మెల్సీ హోదాలో మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఇద్దరూ హూందా రాజకీయాలు చేసే ధోరణి కలవారే. అయితే మరోసారి రజిని చిలకలూరిపేట రాబోతుందన్న వార్తల నేపధ్యంలో ఈ ఇద్దరు నేతలు అలర్ట్ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు చిలకలూరిపేట వైసీపీ శ్రేణులకు కూడా రజిని ఇన్చార్జ్ గా రావడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇన్చార్జ్ గా ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆయన నియోజకవర్గ మొహం చూసింది లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ క్షణమైన తన మేయర్ పదవి పోయే అవకాశం ఉందని భావించిన కావటి మనోహర్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే జనసేన నేతలు మాత్రం ఆయన్ను వదిలేది లేదని, గతంలో పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం అని..
విడదల రజినితో పాటు, ఆమె మరిది, పీఏల పైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పసుమర్రు, యడవల్లి, బోయపాలెం గ్రామాలతో పాటు అనేక గ్రామాల్లో వ్యాపారాలు చేసుకునే వారిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో రజిని వర్గంపై కేసులు నమోదయ్యాయి. ఇంకా రజిని వర్గం అని చెప్పుకుంటే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. నాడు జరగని పనులు నేడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేత చేపించుకుంటున్నామని..ఇప్పుడు మళ్లీ నియోజకవర్గానికి వచ్చి రాజకీయ చిచ్చు పెట్టవద్దని కోరుకుంటున్నారు పేట ప్రజలు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications