విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్ మనీలో బాబువైపు జగన్ వేలు: కోరిక తీరిస్తేనే.. బాధితులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాల్ మనీలో తెలుగుదేశం పార్టీ వారి పాత్రే ఎక్కువ ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. గత వారం రోజులుగా కాల్ మనీ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. కాల్ మనీలో చంద్రబాబు డబ్బులు కూడా ఉన్నాయని జగన్ ఆరోపించారు.

జగన్‌కు చెందిన సాక్షిలో.. చంద్రబాబు, కాల్ మనీ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఎలక్ట్రికల్ డీఈ సత్యానందం కలిసి ఉన్న ఫోటోను చూపిస్తూ... ఆయన అండతోనే కాల్ మనీ ఎదిగిందని ఆరోపించింది. సత్యానందం కోట్లకు పడగలెత్తాడని, అందుకు ప్రభుత్వ పెద్దలతో ఉన్న సత్సంబంధాలే కారణమని తెలుస్తోందని పేర్కొంది.

వారే కాకుండా మిగతా నిందితులు, వెనిగళ్ల శ్రీకాంత్‌కు టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహితుడని పేర్కొంది. ఇదిలా ఉండగా, పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. కాల్ నీ నిర్వాహకులను అరెస్టు చేస్తున్నారు. కొందరు కాల్ మనీ వ్యాపారులు పరారవుతున్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నలుగురి నుంచి ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోను పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా కందుకూరులో మల్యాద్రి అనే వ్యాపారిని అదుపులోకి తీసుకొని, 46 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట వంటి చోట్ల ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 125 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంలో పలువురు బాధితులు బెజవాడ సిపి కార్యాలయానికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. శివమణి, సీతామహాలక్ష్మి అనే ఇద్దరు మహిళలు గోడు వెళ్లబోసుకుంటూ...

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంలో పలువురు బాధితులు బెజవాడ సిపి కార్యాలయానికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. శివమణి, సీతామహాలక్ష్మి అనే ఇద్దరు మహిళలు ప్రామిసరీ నోట్లు చూపిస్తున్న దృశ్యం.

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంలో పలువురు బాధితులు బెజవాడ సిపి కార్యాలయానికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంలో పలువురు బాధితులు బెజవాడ సిపి కార్యాలయానికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సీపీ కార్యాలయంలో ఓ ఏజెంటును ప్రశ్నిస్తున్న పోలీసులు.

కాల్ మనీ ఏజెంట్

కాల్ మనీ ఏజెంట్

కాల్ మనీ దందాలో ఉన్న ఓ మహిళా ఏజెంట్. కాల్ మనీ వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంపై మాట్లాడుతున్న డిజిపి జేవీ రాముడు. కాల్ మనీ దందాలో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు.

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంపై మాట్లాడుతున్న విజయవాడ నగర సిపి గౌతమ్ సవాంగ్. ఆయన ఈ నెల 17వ తేదీ నుంచి సెలవులకు వెళ్తున్నారు.

కాల్ మనీ

కాల్ మనీ

విజయవాడలోని అరండల్ పేటలో నివాసం ఉండే ఓ మహిళ... కుటుంబ అవసరాల నిమిత్తం రూ.6 లక్షలు తీసుకున్నట్లుగా ప్రామిసరీ నోటు.

కాల్ మనీ

కాల్ మనీ

ఏపీలోని విజయవాడలో ఓ మహిళ.. కుటుంబ అవసరాల నిమిత్తం అయిదు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నట్లు రాయించుకున్న ప్రామిసరీ నోటు.

కాల్ మనీ

కాల్ మనీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో కాల్ మనీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మరోవైపు ప్రతిపక్షం సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది.

వైయస్ జగన్

వైయస్ జగన్

కాల్ మనీ దందాలో తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బులు ఉన్నాయని వైయస్ జగన్ మంగళవారం నాడు ఆరోపించారు.

వినతిపత్రం

వినతిపత్రం

కాల్ మనీ, బాక్సైట్ తవ్వకాల పైన ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం ఇస్తున్న వైసిపి అధ్యక్షులు జగన్.

విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లోను సోదాలు నిర్వహించారు. అనకాపల్లిలో ఓ వ్యాపారిని, శ్రీకాకాళంలో శిల్లా నాగేష్, వెంకటరమణలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్రామిసరీ నోట్లతో పాటు డెయిలీ కలెక్షన్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

బడాబడా కాల్ మనీ వ్యాపారులు అజ్ఞాతంలో ఉన్నారు. చాలామంది వ్యాపారులు ఇళ్లకు తాళాలు వేసి పారిపోయారు. విశాఖకు చెందిన శారద అనే మహిళకు అవసరం నిమిత్తం రామకృష్ణ అనే వ్యాపారి రూ.3 లక్షలు ఇచ్చాడు. రూ.12 శాతం చొప్పున వడ్డీ తీసుకుంటున్నాడు. వడ్డీ బాగా పెరగడంతో.. అంత చెల్లించలేనని ఆమె చెప్పింది. దీంతో తన కోరిక తీరిస్తే వదిలేస్తానని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

English summary
Police raids on Call Money oranizers house in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X