బాబు వద్దకు దాడికి వెళ్తారా: స్పీకర్, సిగ్గుండాలి.. ఊగిపోయిన జగన్, యనమల చురకలు

హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం పైన శుక్రవారం సాయంత్రం శాసన సభలో వాడిగావేడిగా చర్చ జరిగింది. ఓ సమయంలో చంద్రబాబు విపక్ష నేతల పైన ఊగిపోయారు. పలుమార్లు స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రతిపక్ష సభ్యులను సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు.

వైసిపి నేతల ఆందోళనపై బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులు సంప్రదాయం నేర్చుకోవాలని, వేలు చూపించడం ఏమిటని మండిపడ్డారు.

సభాపతి శివప్రసాద రావు మాట్లాడుతూ... సభాస్థానం పైకి దాడికి పోతారా? మీరు మీ సీట్లోకి వెళ్లాలని, మీరు ఇలాగే గొడవ చేస్తుంటే వి,యం పైన చర్చకు మీకు ఆసక్తి లేదని భావించవలసి ఉంటుందని అన్నారు.

బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులు సంయమనం పాటించాలన్నారు.

వైసిపి నేతల ఆందోళనను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ... జగన్ మాట్లాడవచ్చునని, కానీ సంయమనం పాటించాలన్నారు.

జగన్ మాట్లాడుతూ... నాకు విషయం అర్థం కావడం లేదని, చంద్రబాబు రావడం, ప్రకటన చదవడం ఏమిటన్నారు. నిజంగా నాకు ఏమీ అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి అసెంబ్లీని నేను నా జీవితంలో చూడలేదన్నారు. మమ్మల్ని లెక్కచేయకుండా చంద్రబాబు ప్రకటన చేస్తారా అన్నారు.

Call money sex scam rocks AP assembly: Speaker unhappy with YSRCP

స్పీకర్ మాట్లాడుతూ... జగన్ గారు మీరు సభను తప్పుదోవ పట్టించవద్దన్నారు. సభా నాయకుడు మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. ఏదైనా మాట్లాడిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ వస్తుందన్నారు. ముఖ్యమంత్రి స్థానం వద్దకు వెళ్తారా అని ప్రశ్నించారు.

20 మంది సీఎం స్థానం వద్దకు దాడికి వెళ్తారా అని స్పీకర్ వైసిపి సభ్యులను ప్రశ్నించారు. మీరు చెప్పేది వినడం లేదని, మీలో చెప్పేవాళ్లు లేరన్నారు. సభా పక్ష నేత, విపక్ష నేత ఇద్దరికీ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. విపక్ష సభ్యులు సంప్రదాయం పాటించాలన్నారు. సభానేత మాట్లాడుతుంటే అడ్డుకోవద్దన్నారు.

మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... తాము ప్రకటన చేస్తామని ముందే చెప్పామన్నారు. సభా సంప్రదాయాల ప్రకారం మేము నడుచుకుంటున్నామని చెప్పారు. వైసిపికి ధైర్యం ఉంటే ఎందుకు చర్చించడం లేదన్నారు. సీఎం ప్రకటన పూర్తయ్యాకే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశముంటుందన్నారు.

వైసిపి సభ్యులు అదేపనిగా నిరసన తెలుపుతుండగా... స్పీకర్ వారిని కూర్చోమని పదేపదే విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రకటన తర్వాత మీకు అవకాశమిస్తామని వైసిపి సభ్యులకు చెప్పారు.

బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... వాదనలు సభాసంప్రదాయం కాదన్నారు. జగన్‌కు సమయం ఇస్తామని స్పీకర్ స్పష్టంగా చెప్పారని, అలాంటప్పుడు స్పీకర్‌తో వాగ్వాదం సరికాదని సూచించారు. మీ సభ్యులందరినీ కూర్చోబెట్టాలని చెప్పారు. జగన్‌కు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని విష్ణు కుమార్ రాజు సభాపతిని కోరారు.

యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రకటన చేస్తామంటే చేయనివ్వరని, చర్చిద్దామని చెప్పినా ఇలా అడ్డుకోవడం ఏమిటన్నారు. మీరు సస్పెన్షన్ కోరుకుంటున్నారా అని యనమల ప్రశ్నించారు. చర్చల నుంచి విపక్ష సభ్యులు పారిపోతున్నారన్నారు.

జగన్ మాట్లాడుతూ... ఇంత దారుణంగా కౌరవ సభ జరుగుతుంటే ప్రజా సమస్యలు ఎలా ముందుకు వస్తాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుతో కాల్ మనీ నిందితుల ఫోటోలను సభలో చూపించారు. నిందితుడైన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడన్నారు. మేం ముఖ్యమంత్రి ప్రకటను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.

బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. సీఎం పేరు, సీఎం తనయుడి పేరు ప్రస్తావించడం దారుణమన్నారు. వీటిని రికార్డుల నుంచి తొలగించాలన్నారు.

మంత్రి యనమల మాట్లాడుతూ... తనకు ఉన్న 34 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకుడిని చూడలేదన్నారు. మేం ప్రకటన చేస్తాం, చర్చిస్తామంటే వద్దని చెప్పే నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదన్నారు.

ఏమైనా అంటే జగన్ బుక్ పట్టుకొని చదువుతాడని, పైనో పేరా, కిందో పేరా, మధ్యలో ఓ పేరా ఉంటుందని, వాటిని చదవడని ఎద్దేవా చేశారు. చర్చిద్దామంటే వద్దని చెప్పడమేమిటన్నారు. ఇలాంటి నాయకుడును ఎన్నుకున్నందుకు ఆ నియోజకవర్గ ప్రజలు బాధపడతారని ఎద్దేవా చేశారు. వైసిపి తీరు మంచి పద్ధతి కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+