వీడియో మెసేజ్, మృతి: బోండా అనుచరులు ఆక్రమించుకోవడం వల్లే

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీలోని విజయవాడలో పన్నెండేళ్ల బాలిక సాయిశ్రీ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. ఆమెకు ఈ రోజు (సోమవారం) అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు నివాసం వద్ద డప్పులతో నిరసన తెలిపారు.

వారు కమిషనరేట్ కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.

నాన్న బతకాలని ఉందంటూ వాట్సాప్ లో సెల్పీ పంపి చనిపోయిన చిన్నారి

Cancer patient Sai Sri dies, Family protest at MLA's residence

కాగా, విజయవాడలోని దుర్గాపురంలో విషాదకర ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.తన తల్లితో కలిసి నివాసం ఉంటోన్న సాయిశ్రీ క్యాన్సర్‌తో మృతి చెందింది. కొంతకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మెరుగైన వైద్యం కోసం డబ్బు అవసరం ఉండటం, విభేదాలతో బాలిక తండ్రి కొంతకాలం కిందట వదిలి వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తల్లి వైద్యం చేయించలేకయింది. దీంతో పరిస్థితి విషమించి బాలిక తుదిశ్వాస విడిచింది.

Cancer patient Sai Sri dies, Family protest at MLA's residence

తమ నుంచి విడిపోయిన తండ్రి పట్టించుకోవడం లేదని తెలుసుకున్న చిన్నారి, చనిపోయేందుకు మూడు రోజుల ముందు తండ్రికి వాట్సాప్‌ ద్వారా వీడియో మెసేజ్‌ పంపింది. తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా బతికించాలని విజ్ఞప్తి చేసింది.తన పేరిట ఉన్న ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో తనకు వైద్యం చేయించాలని కోరింది.

కాగా, తమ అపార్ట్‌మెంట్‌ను అమ్మేందుకు ప్రయత్నించినా, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా సన్నిహితులు ఇంటిని ఆక్రమించుకున్నందున అమ్మలేక పోయినట్లు బాలిక తల్లి సుమశ్రీ తెలిపారు. తన కూతురు చావుకు కారణమైన భర్త సహా, అపార్ట్‌మెంటును ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం డిమాండ్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cancer patient Sai Sri dies, Family protest at MLA's residence.
Please Wait while comments are loading...